ఢిల్లీలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.మరి కాసేపటిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ ( CM Jagan )సమావేశం కానున్నారు.
ఈ మేరకు పార్లమెంట్ లో ప్రధాని మోదీ( Narendra Modi )తో పాటు పలువురు కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు విభజన హామీలపై జగన్ చర్చించే అవకాశం ఉంది.
అలాగే పలు అభివృద్ధి అంశాలపై కూడా మోదీతో చర్చించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
అలాగే పోలవరం ప్రాజెక్టు( Polavaram project ) నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కూడా జగన్ ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరియు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Nirmala Sitharaman ) తో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉందని సమాచారం.