టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్( Choreographer Sekhar Master) గురించి మనందరికీ తెలిసిందే.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ కూడా ఒకరు.
కాగా మొదట టీవీ షోలతో కెరీర్ ప్రారంభించిన శేఖర్ మాస్టర్ ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.స్టార్ హీరోలతో కలిసి పనిచేశాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు( Star Heroes Movies ) కొరియోగ్రాఫర్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్.ప్రస్తుతం ఒకవైపు సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరొకవైపు తెలుగులో ప్రసారం అవుతున్న ఢీ లాంటి డాన్స్ షోలకు జెడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే.తాజాగా శేఖర్ మాస్టర్ వాళ్ళ వదిన చనిపోయారు.ఇదే విషయాన్ని సోషల్ మీడియా( Social Media ) వేదికగా తెలుపుతూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు శేఖర్ మాస్టర్.ఈ క్రమంలోనే శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు.
వదిన మిస్ యూ. ఎంతో బాధని అనుభవించావు.అయినా ఎంతో ధైర్యంగా నిలబడ్డావ్.నువ్వే నాకు ధైర్యాన్నిచ్చావ్.పాజిటివిటీని పెంచావ్.నువ్వు లేవనే వార్తని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను.
ఇప్పుడైనా స్వర్గంలో ఉంటావ్ అని ఆశిస్తున్నాను.నువ్వెప్పుడు మాతోనే ఉంటావ్.నీ ఆత్మకు శాంతి చేకూరాలి అని శేఖర్ మాస్టర్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.శేఖర్ మాస్టర్ వదిన అని చెప్పిన ఈమె తన భార్యకు అక్క అని తెలుస్తోంది.
అయితే ఈమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది మాత్రం బయటపెట్టలేదు.ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు శేఖర్ మాస్టర్ కు ధైర్యంగా ఉండండి అంటూ ధైర్యం చెబుతున్నారు.