కావాల్సిన అటెన్షన్ సాధించిన 'గాడ్ ఫాదర్'.. ఇక తగ్గేదేలే!

టాలీవుడ్ లో దసరా సందడి మొదలయ్యింది.ఈ ఏడాది టాలీవుడ్ నుండి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా ఉంది.

 Chiranjeevi Godfather Hype Next Level, Megastar Chiranjeevi, God Father, Salman-TeluguStop.com

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక రీమేక్ సినిమా.మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కడం వల్ల ముందు నుండి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు క్రియేట్ అవ్వలేదు.

విడుదల తేదీ దగ్గర అవుతున్న మొన్నటి వరకు ఈ సినిమాపై అనుకున్నంత బజ్ లేదు.ఇందులో చిరు మాత్రమే కాదు సల్మాన్ ఖాన్, నయనతార ఉన్నప్పటికీ బజ్ క్రియేట్ కాకపోవడం గమనార్హం.

అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి ప్లాప్ సినిమా తర్వాత రావడం కూడా ఈ సినిమాకు అంతగా అంచనాలు లేకపోవడానికి కారణం.మరి రిలీజ్ 10 రోజుల వరకు కూడా ఇలా అంచనాలు లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ భయపడ్డారు.

Telugu God, Chiranjeevi, Mohan Raja, Nayanthara, Salman Khan-Movie

ఈ సినిమాపై ఆచార్య ఎఫెక్ట్ పడి ఇది కూడా ప్లాప్ అవుతుందేమో అని ఆలోచనలు చేసారు.అయితే ఎట్టకేలకు గాడ్ ఫాదర్ టీమ్ తెలివిగా అలోచించి ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.మొదట్లో డిజప్పోయింట్ అయినా మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషీగా ఉన్నారు.వరుసగా మెగాస్టార్ లుక్స్ కు సంబందించిన పోస్టర్స్ వదులుతూ మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.మెగాస్టార్ లుక్ చూసి అంతా స్టన్ అయిపోతున్నారు.

Telugu God, Chiranjeevi, Mohan Raja, Nayanthara, Salman Khan-Movie

నిన్న రిలీజ్ చేసిన సాంగ్ లో ఈయన గ్రేస్ మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.అందరిని ఆకట్టుకుంది.దీంతో అందరి అటెన్షన్ ఈ సినిమాపై వచ్చేలా చేసారు.

దీంతో ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube