కావాల్సిన అటెన్షన్ సాధించిన 'గాడ్ ఫాదర్'.. ఇక తగ్గేదేలే!

టాలీవుడ్ లో దసరా సందడి మొదలయ్యింది.ఈ ఏడాది టాలీవుడ్ నుండి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాల్లో మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ కూడా ఉంది.

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక రీమేక్ సినిమా.

మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కడం వల్ల ముందు నుండి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు క్రియేట్ అవ్వలేదు.

విడుదల తేదీ దగ్గర అవుతున్న మొన్నటి వరకు ఈ సినిమాపై అనుకున్నంత బజ్ లేదు.

ఇందులో చిరు మాత్రమే కాదు సల్మాన్ ఖాన్, నయనతార ఉన్నప్పటికీ బజ్ క్రియేట్ కాకపోవడం గమనార్హం.

అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య వంటి ప్లాప్ సినిమా తర్వాత రావడం కూడా ఈ సినిమాకు అంతగా అంచనాలు లేకపోవడానికి కారణం.

మరి రిలీజ్ 10 రోజుల వరకు కూడా ఇలా అంచనాలు లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ భయపడ్డారు.

"""/"/ ఈ సినిమాపై ఆచార్య ఎఫెక్ట్ పడి ఇది కూడా ప్లాప్ అవుతుందేమో అని ఆలోచనలు చేసారు.

అయితే ఎట్టకేలకు గాడ్ ఫాదర్ టీమ్ తెలివిగా అలోచించి ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యారు.

మొదట్లో డిజప్పోయింట్ అయినా మెగా ఫ్యాన్స్ ఇప్పుడు ఖుషీగా ఉన్నారు.వరుసగా మెగాస్టార్ లుక్స్ కు సంబందించిన పోస్టర్స్ వదులుతూ మరింత ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.

మెగాస్టార్ లుక్ చూసి అంతా స్టన్ అయిపోతున్నారు. """/"/ నిన్న రిలీజ్ చేసిన సాంగ్ లో ఈయన గ్రేస్ మెగా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు.

అందరిని ఆకట్టుకుంది.దీంతో అందరి అటెన్షన్ ఈ సినిమాపై వచ్చేలా చేసారు.

దీంతో ఓపెనింగ్స్ కూడా గట్టిగానే వస్తాయని అంచనా వేస్తున్నారు.ఇక ఈ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు, కొణిదెల ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా.

థమన్ సంగీతం అందిస్తున్నాడు.

నాని తేజ సజ్జ లకు సక్సెస్ లు వస్తున్నాయి…మరి ఆ ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం ఎందుకు ప్లాప్ లు వస్తున్నాయి…