మళ్లీ కారుకూతలు కూస్తున్న చైనా.. మరలా మొదలైన మ్యాప్‌ వివాదం!

చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు వివాదాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయి.ఈ వ్యవహారమై 2020లో లడఖ్ ప్రాంతంలో( Laddakh ) రెండు దేశాల మధ్య భయంకరమైన సైనిక దాడి కూడా జరిగింది.

 China Latest Edition Map Includes Disputed Arunachal Pradesh Aksai Chin Details-TeluguStop.com

ఆ తర్వాత కూడా చైనా( China ) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది.తాజాగా చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాచిన్‌లను తమ భూభాగంలో భాగంగా చూపారు.

ఈ రెండు భారతీయ రాష్ట్రాలు కాగా చైనా వాటిని తమవిగా చెప్పుకుంటూ తన వక్రబుద్ధిని మరోసారి నిరూపించుకుంది.మ్యాప్‌ చూసాక భారతదేశం( India ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇట్లాంటి చేష్టలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.మ్యాప్‌లో వాస్తవ పరిస్థితులు కనిపించడం లేదని భారత ప్రభుత్వం పేర్కొంది.

భారత్‌లోని కొన్ని భాగాలతో కూడిన కొత్త మ్యాప్‌ను విడుదల చేయడాన్ని చైనా సమర్థించుకోవడంతో ఇండియా షాక్ అయ్యింది.ఈ చర్యను సార్వభౌమత్వాన్ని ప్రతిబింబించే సాధారణ ప్రక్రియ అని చైనా పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని ఇండియా వ్యాఖ్యానించింది.2023 స్టాండర్డ్ మ్యాప్( 2023 Standard Map ) విడుదల చట్టం ప్రకారమే జరిగిందని, భారత్ నిష్పక్షపాతంగా మ్యాప్‌ను, అందులోని ప్రాంతాలను పరిగణిస్తుందని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఇటీవల కారుకూతలు కూశారు.చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌కు మరింత ఆగ్రహం తెప్పించడమే కాకుండా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి.

Telugu Aksaichin, Arindam Bagchi, China Map, India, India China, Nri, China Sea,

2023 ఏడాదికి గానూ అరుణాచల్ ప్రదేశ్,( Arunachal Pradesh ) అక్సాచిన్,( Aksaichin ) దక్షిణ చైనా సముద్రం( South China Sea ) సహా భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను కలిగి ఉన్న కొత్త మ్యాప్‌ను చైనా విడుదల చేసింది.ఈ మ్యాప్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఇది రెచ్చగొట్టే చర్య అని పేర్కొంది.దౌత్య మార్గాల ద్వారా భారత ప్రభుత్వం చైనా చర్యలపై తీవ్ర నిరసన తెలిపింది.మరోవైపు కాంగ్రెస్, భారతదేశంలోని ఇతర ప్రతిపక్షాలు మోదీ అసమర్థత వల్లే ఇదంతా జరుగుతోందని విమర్శించాయి.

Telugu Aksaichin, Arindam Bagchi, China Map, India, India China, Nri, China Sea,

2023 ఏడాదికి గానూ చైనా.ఓ స్టాండర్డ్‌ మ్యాప్‌ను సోమవారం విడుదల చేసింది.ఇందులో వివాదాస్పద ప్రాంతాలతో పాటు భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్‌చిన్ లాంటి ప్రాంతాలతో పాటు.తైవాన్‌, దక్షిణ చైనా సముద్రాలను కూడా కలుపుకోవడంతో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందర్‌ బాగ్చి( Arindam Bagchi ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా అందులో వెల్లడించడాన్ని తప్పు పట్టారు.చైనా విడుదల చేసిన కొత్త మ్యాప్‌ను భారత్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది.చైనా చేసిన ఈ చర్య పొరుగు దేశాలతో ఉన్న సరిహద్దుల వివాదాలను మరింత రెచ్చగొట్టడమేనని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube