'కన్నా'ను కార్నర్ చేస్తున్న రాయపాటి ? బాబుకి తలనొప్పే ?

గుంటూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు మంట పుట్టిస్తూనే ఉంటాయి.ఎంతోమంది రాజకీయ ఉద్దండులు  ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉండడంతో  ఎవరికి వారు తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.

 Chandrababu Naidu Troubled With Differences Between Kanna Lakshminarayana And Ra-TeluguStop.com

ఇది ఎలా ఉంటే ఇప్పుడు గుంటూరు జిల్లా  టిడిపిలో ఇద్దరు సీనియర్ పొలిటిషన్ ల విషయంలో పేచీలకు దిగుతుండడం అధినేత చంద్రబాబుకు ( Chandrababu Naidu ) తలనొప్పిగా మారింది .ముఖ్యంగా గుంటూరు జిల్లా సీనియర్ నేతగా,  అనేకసార్లు ఎంపీగా గెలిచిన రాయపాటి సాంబశివరావు( Rayapati Sambasivarao ) టిడిపిలోనే ఉన్నారు .ఇందిరాగాంధీకి సన్నిహితుడుగాను పేరుపొందిన ఆయన  గుంటూరు నుంచి ఎంపీగా నాలుగుసార్లు,  నరసరావుపేట నుంచి ఒకసారి గెలిచారు .2014లో చివరిసారిగా టిడిపి నుంచి గెలిచారు.

కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయపాటి సాంబశివరావు మరో సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కు( Kanna Lakshminarayana ) ఎప్పటి నుంచో రాజకీయ విభేదాలు ఉన్నాయి.  వైఎస్  రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరు మేయర్ గా కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు,  రాయపాటి సాంబశివరావు కుమారుడు కలిసి పదవిని పంచుకున్నారు.

ఏపీ తెలంగాణ విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో పూర్తిగా బలహీనం కావడంతో రాయపాటి టిడిపిలో చేరారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Kanna Rayapati-Politics

ఇక కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ నుంచి బిజెపి లో చేరి రాష్ట్ర అధ్యక్షుడుగానూ పనిచేసి ప్రస్తుతం టిడిపిలో చేరారు.  ఇద్దరు ఒకే పార్టీలో ఉండడంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో  పోటీ తీవ్రంగా నెలకొంది.  రాబోయే ఎన్నికల్లో తన కుటుంబానికి మూడు సీట్లు కేటాయించాలని రాయపాటి సాంబశివరావు కోరుతున్నారు .వాటిలో రెండు అసెంబ్లీ ఒక ఎంపీ సీటు ఉన్నాయి.ఎమ్మెల్యే సీట్లలో పెదకూరపాడు , సత్తెనపల్లి ఉన్నాయి.

సత్తెనపల్లి నుంచి రాయపాటి రంగారావు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తుండగా,  పెదకూరపాడు నుంచి తన సోదరుడి కుమార్తె రాయపాటి శైలజకు సీటు ఇవ్వాల్సిందిగా సాంబశివరావు చంద్రబాబును కోరుతున్నారు.

Telugu Ap Cm Jagan, Chandrababu, Jagan, Kanna Rayapati-Politics

అయితే సత్తెనపల్లి నుంచి పోటీ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ చూస్తున్నారు .అయితే కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయాలని రాయపాటి సూచిస్తున్నారు.గుంటూరు జిల్లా వ్యాప్తంగా కన్నా కు పట్టు ఉందని,  ఆయన ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు అవకాశం ఉందని రాయపాటి సలహాలు ఇస్తున్నారు.

  అయితే తన సీటు విషయంలో రాయపాటి ఈ విధంగా కొర్రీలు పెడుతూ ఉండడం పై కన్నా ఫైర్ అవుతున్నారు.ఈ ఇద్దరు సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబుకి పెద్ద తిప్పలే వచ్చిపడ్డాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube