నిబంధనలకు విరుద్ధంగా ఓ మాజీ ఎమ్మెల్యే తన కూతురి వివాహం జరిపించినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.అనంతపురం జిల్లా మడకశిర మాజీ ఎమ్మెల్యేపై పోలీస్ కేస్ ఫైల్ చేశారు.కోవిడ్-19 నిబంధనలకు ఉల్లంఘించి తన కూతురి వివాహం చేయడంతో అతడిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఈరన్న తన కూతురి పెళ్లి చేయడానికి నిశ్చయించుకున్నారు.
ఈ క్రమంలో తన సొంత గ్రామమైన అమలాపురంలో పెళ్లి జరిగింది.నిబంధనలకు విరుద్ధంగా పెళ్లిలో అధిక సంఖ్యలో బంధువులు, మిత్రులు హాజరయ్యారు.
ప్రభుత్వం 50 మందికి మంచి వివాహాది కార్యక్రమాలు జరపొద్దని ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది.పెళ్లికి ఎక్కువ మంది హాజరుకావడంతో ఎమ్మెల్యే ఈరన్నపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఏపీలో కరోనా విజృంభణ కోనసాగుతూనే ఉంది.దీంతో ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది.పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలకు అతి తక్కువ బంధు మిత్రువులతో జరుపుకోవాలనే నిబంధనను కూడా పెట్టారు.ఈ మేరకు కొందరు సెలబ్రిటీలు అతి కొద్ది మందితోనే బంధుమిత్రుల నడుమే పెళ్లిళ్లు కూడా జరిగాయి.
పెళ్లి వేడుకలు జరుపుకోవాలని అనుకునే వారు సమీప పోలీస్టేషన్ నుంచి అనుమతి కూడా పొందాలి.నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం అప్పటికే హెచ్చరించింది.
కానీ, ఎమ్మెల్యే పోలీసులకు తెలపకుండా, నిబంధనలు పాటించకుండా పెళ్లి జరపడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.