ఐకాన్ స్టార్ అల్లు అర్జున్( Allu Arjun ) గత మూడేళ్లలో నటించిన ఏకైక సినిమా పుష్ప ది రూల్( Pushpa The Rule ) మాత్రమేననే సంగతి తెలిసిందే.ఎన్నో ఆవాంతరాలను దాటుకుని ఈ సినిమా ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది.
అయితే ఇకపై వేగంగా సినిమాల్లో నటిస్తానని బన్నీ అభిమానులకు మాట ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ మాటను బన్నీ ఎంతమేర నిలబెట్టుకుంటారనే ప్రశ్నకు ఆసక్తికర జవాబు వినిపిస్తోంది.
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది.మైథలాజికల్ సబ్జెక్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా దర్శకుడు త్రివిక్రమ్( Director Trivikram ) ఈ సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారని నిర్మాత నాగవంశీ( Producer Nagavamsi ) చెప్పుకొచ్చారు.2025 మిడిల్ లో ఈ సినిమా షూట్ మొదలవుతుందని 2026 సంవత్సరంలో ఈ సినిమా రిలీజవుతుందని నాగవంశీ కామెంట్లు చేశారు.
హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.త్వరలో ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.అటు త్రివిక్రమ్ ఇటు బన్నీ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.
గుంటూరు కారం తర్వాత హారిక హాసిని బ్యానర్ లో తెరకెక్కనున్న సినిమా ఇదే కావడం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే స్టార్ హీరో అల్లు అర్జున్ వేగంగా సినిమాల్లో నటిస్తానని ఏడాదికి ఒక సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటానని అభిమానులకు హామీ ఇచ్చారు.ప్రస్తుతానికి బన్నీ ఆ హామీని నిలబెట్టుకోవడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బన్నీ ఈ కామెంట్లపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.
మూడేళ్లకు, రెండేళ్లకు ఒక సినిమాలో బన్నీ నటిస్తే లాభం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.