ఆ రీజన్ వల్లే సలార్ మూవీని మిస్ చేసుకున్నా.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్!

మారుతి( Maruthi ) దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న చిత్రం రాజాసాబ్.( Rajasaab ) ఇందులో మాళవిక మోహనన్( Malavika Mohanan ) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తో నటించడం గురించి తెలిపారు.

 Malavika Mohanan Reveals She Missed A Role In Prabhas Salaar Details, Malavika M-TeluguStop.com

ఈ మేరకు మాళవిక మాట్లాడుతూ.

Telugu Salaar, Maruthi, Malavikamohanan, Prabhas, Prabhasmalavika, Prashanth Nee

రాజాసాబ్‌ సినిమాతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను.ఇదొక హారర్‌, రొమాంటిక్‌ కామెడీ మూవీ. ఆ సినిమా వర్క్‌ లో భాగంగా గత కొంత కాలంగా హైదరాబాద్‌ లోనే ఎక్కువగా ఉంటున్నాను.

ఈ ప్రాజెక్ట్‌ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను.ఇలాంటి జానర్‌ లో నేను ఎప్పుడూ వర్క్‌ చేయలేదు.

కామెడీ, హారర్‌, రొమాన్స్‌ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఈ కథలో ఉంటాయి.ప్రభాస్‌ తో వర్క్‌ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది.

బాహుబలి సినిమాకు( Baahubali ) నేను వీరాభిమానిని.బాహుబలి 1, 2 చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్‌ కు అభిమానిని అయ్యాను.

ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నాను.

Telugu Salaar, Maruthi, Malavikamohanan, Prabhas, Prabhasmalavika, Prashanth Nee

అలాంటి సమయంలో నాకు సలార్‌( Salaar ) నుంచి అవకాశం వచ్చింది.ప్రశాంత్‌ నీల్‌ ఒక రోల్‌ కోసం అడిగారు.ఆ క్షణం ఎంతో సంతోషించాను.

నా కల నెరవేరుతుందనుకున్నాను.అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ చేయలేకపోయాను.

కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి రాజాసాబ్‌ కోసం ఆఫర్‌ వచ్చింది.నేను ఆశ్చర్యపోయాను.

ప్రభాస్‌ మూవీతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉన్నట్టు ఉంది అనుకున్నాను అని మాళవికా మోహనన్‌ తెలిపారు.ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇకపోతే ది రాజాసాబ్‌ సినిమా విషయానికి వస్తే.హారర్‌, రొమాంటిక్‌ కామెడీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్‌ ఇప్పటి వరకూ పోషించని రెండు భిన్న కోణాలు ఉన్న పాత్రలో సందడి చేయనున్నారు.కాగా ఈ మూవీ 2025 ఏప్రిల్‌ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube