ఆ రీజన్ వల్లే సలార్ మూవీని మిస్ చేసుకున్నా.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మారుతి( Maruthi ) దర్శకత్వంలో ప్రభాస్( Prabhas ) హీరోగా నటిస్తున్న చిత్రం రాజాసాబ్.
( Rajasaab ) ఇందులో మాళవిక మోహనన్( Malavika Mohanan ) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహనన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ ప్రభాస్ తో నటించడం గురించి తెలిపారు.
ఈ మేరకు మాళవిక మాట్లాడుతూ. """/" /
రాజాసాబ్ సినిమాతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను.
ఇదొక హారర్, రొమాంటిక్ కామెడీ మూవీ.ఆ సినిమా వర్క్ లో భాగంగా గత కొంత కాలంగా హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటున్నాను.
ఈ ప్రాజెక్ట్ విషయంలో నేనెంతో సంతోషంగా ఉన్నాను.ఇలాంటి జానర్ లో నేను ఎప్పుడూ వర్క్ చేయలేదు.
కామెడీ, హారర్, రొమాన్స్ ఇలా అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ కథలో ఉంటాయి.
ప్రభాస్ తో వర్క్ చేయడం ఎంతో సరదాగా ఉంటుంది.బాహుబలి సినిమాకు( Baahubali ) నేను వీరాభిమానిని.
బాహుబలి 1, 2 చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్ కు అభిమానిని అయ్యాను.
ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నాను. """/" /
అలాంటి సమయంలో నాకు సలార్( Salaar ) నుంచి అవకాశం వచ్చింది.
ప్రశాంత్ నీల్ ఒక రోల్ కోసం అడిగారు.ఆ క్షణం ఎంతో సంతోషించాను.
నా కల నెరవేరుతుందనుకున్నాను.అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ చేయలేకపోయాను.
కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి రాజాసాబ్ కోసం ఆఫర్ వచ్చింది.నేను ఆశ్చర్యపోయాను.
ప్రభాస్ మూవీతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉన్నట్టు ఉంది అనుకున్నాను అని మాళవికా మోహనన్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఇకపోతే ది రాజాసాబ్ సినిమా విషయానికి వస్తే.హారర్, రొమాంటిక్ కామెడీ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్ ఇప్పటి వరకూ పోషించని రెండు భిన్న కోణాలు ఉన్న పాత్రలో సందడి చేయనున్నారు.
కాగా ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ ఆరోగ్య సమస్య వల్ల బెయిల్ ఇవ్వాలంటున్న మోహన్ బాబు.. అసలేం జరిగిందంటే?