బీజేపీపై బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు హాట్ కామెంట్స్ చేశారు.
అదానీ వ్యవహారంపై పార్లమెంట్ లో చర్చించేందుకు బీజేపీ భయపడుతోందని ఆరోపించారు.
అదానీ ప్రధాని మోదీకి స్నేహితుడు కాబట్టే చర్చ జరగడం లేదని కేకే విమర్శించారు.
ఎల్ఐసీ ద్వారా అదానీకి రూ.వేల కోట్ల మేలు చేశారన్నారు.అందుకే తమ వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నారని తెలిపారు.అదానీ అంత వేగంగా ప్రపంచ కుబేరిడిగా ఎలా ఎదిగారు అనే దానిపై సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.