ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో తీర్పును తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది.మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది.
ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది.
కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరుతూ బీజేపీ సహా పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం డిసెంబర్ 16న జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ తీర్పును రిజర్వ్ చేసింది.
కాగా మధ్యాహ్నం న్యాయస్థానం వెలువరించే తీర్పు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.