బ్రహ్మోత్సవం రివ్యూ

చిత్రం : బ్రహ్మోత్సవం


బ్యానర్: మహేష్ బాబు ఎంటర్‌టేన్‌మెంట్, పి.వి.

 Brahmotsavam Movie Review-TeluguStop.com

పి సినిమా


డైరెక్టర్ : శ్రీకాంత్ అడ్డాల


నిర్మాత: మహేష్ బాబు, ప్రసాద్ వి పోట్లురి


మ్యూజిక్ డైరెక్టర్: మిక్కీ J మెయెర్


విడుదల తేది :

May20, 2016

నటినటులు: మహేష్ బాబు, కాజల్, సమంతా, ప్రణీత సుభాష్


శ్రీకాంత్ అడ్డాల – మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటే మొదటి నుంచీ భారీగానే అంచనాలు ఉండడం సహజం.మహేష్ – శ్రీకాంత్ ఇద్దరూ కలిసి ఇచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఇప్పటికీ టీవీ లో ఒస్తే మిస్ అవకుండా చూస్తూ ఉంటాం అలంటి వాళ్ళు మళ్ళీ సినిమా తీస్తే ఏ ప్రేక్షకుడు మాత్రం ఆసక్తి ప్రదర్శించడు ?? మహేష్ బాబు అప్పటికీ శ్రీమంతుడు తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫార్మ్ లో ఉండగా తన ఫార్మ్ ని మహేష్ ఎంతవరకూ కంటిన్యూ చేసాడు అనేది చూద్దాం రండి

కథ – పాజిటివ్ లు

బంధుత్వాల మీద బంధాల మీద పెద్దగా ఆసక్తి లేని ఒక కొడుకు కి వాటి యొక్క గొప్పతనం తెలియజేసిన తండ్రి కథ ఇది.కొడుకుగా మహేష్ , తండ్రిగా సత్యరాజ్ తమ పాత్రల్లో అద్భుతంగా రాణించారు.మహేష్ – సత్యరాజ్ ల మధ్యన సీన్ లు చాలా చక్కగా కుదిరాయి.

ముఖ్యంగా మహేష్ సత్యరాజ్ కాళ్ళకి చెప్పులు తొడిగే సీన్ అదుర్స్ అని చెప్పాలి.సినిమాని చాలా క్లీన్ గా మొదలు పెట్టి ఆసక్తికరంగా తీసుకుని వెళ్ళడం లో తనకి తానే సాటి అని మళ్ళీ నిరూపించాడు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల .బంధుత్వాల విషయం లో అంతా యాంత్రికంగా మారిన ఈ కాలం లో వాటి గొప్పతనం చాటుతూ శ్రీకాంత్ చేసిన ఈ ప్రయత్నం చాలా గొప్పది.మహేష్ తన స్క్రీన్ ప్రేజెన్స్ తో నటన తో సినిమాని తన బుజాల మీద నడిపించాడు.

విజయవాడ యాస లో మాట్లాడుతూ సినిమా మొత్తం తానే కనిపించాడు మహేష్.చిన్నోడుగా సీతమ్మ వాకిట్లో సినిమాలో అందరికీ నచ్చేసిన మహేష్ ఈ సినిమాతో కెరీర్ లో మరొక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసాడు.

ముఖ్యంగా సత్యరాజ్ చనిపోయినప్పుడు మహేష్ నటన అద్భుతం అని చెప్పాలి.మహేష్ సరసన కాజల్ – సమంత చక్కగా ఒదిగిపోయారు.రేవతి , జయసుధ తమ పరిధి లో చాలా బాగా చేసాడు.మిక్కీ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫెక్ట్ గా సెట్ అవగా DOP తన టాలెంట్ ని పాటలు తీయడం లో చూపించాడు.

అన్ని పాటలూ స్క్రీన్ మీద క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది.మంచి ఫీల్ ని ఇస్తూ పాటలు సాగుతాయి.

స్క్రీన్ ప్లే విషయం లో చాలా చోట్ల స్లో గా అనిపించిన అడ్డాల .మహేష్ బాబు ఇప్పటి వరకూ చెయ్యని ఒక కొత్త లవ్ ట్రాక్ చేసాడు ఈ సినిమాలో.ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా సాగుతూ ఇంటర్వెల్ ఒచ్చే సరికి ఆసక్తి రెట్టింపు చేస్తాడు శ్రీకాంత్ .ఇంటర్వెల్ కి ముందర రావు రమేష్ ఆదరగోట్టేసాడు

నెగెటివ్ లు

ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ చాలా మటుకు తగ్గింది అనే చెప్పాలి.డైరెక్టర్ స్క్రీన్ ప్లే విషయం లో మరింత జాగ్రత్త తీసుకుని ఉంటె బాగుండేది అనిపిస్తుంది.పాటలు ఎక్కడ పడితే అక్కడ రావాడ కాస్త అసహనం తెప్పించే విషయం.

శ్రీకాంత్ కామెడీ ట్రాక్ కోసం వేరే కమీడియన్ లని తీసుకుని ఉంటే బాగుండేది.మహేష్ – కాజల్ మధ్యన కుదిరిన రోమాన్స్ మహేష్ సమంత ల మధ్యన కుదరనే లేదు.

ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకుని నడుస్తున్న సినిమాలు ఒస్తున్న ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ విషయం లో మరికాస్త శ్రద్ధ తీసుకుని ఉంటె బాగుండేది.ఓవర్ సెంటిమెంట్ లు కూడా యూత్ కి పెద్దగా ఎక్కకపోవచ్చు .సెకండ్ హాఫ్ లో విపరీతమైన స్లో స్క్రీన్ ప్లే తో పాటు అవసరం లేని సీన్ లు బోలెడు ఒస్తూ ఉంటాయి, ముఖ్యంగా ప్రేక్షకులకీ కథకీ మధ్య కనక్షన్ తీవ్రంగా దెబ్బ తింటుంది.అది సినిమాకి అతి పెద్ద మైనస్ పాయింట్ .

మొత్తంగా , సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రేంజ్ కి కనీసం అందుకొను గూడా అందుకోలేదు ఈ బ్రహ్మోత్సవం.మహేష్ నటన తప్ప సినిమాలో ఏమీ లేదు.

ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా తీసాడు అనుకున్న తరుణం లో సెకండ్ హాఫ్ లో కనక్షన్ తీవ్రంగా మిస్ అయ్యాడు.సినిమా మొత్తం మీద ఎక్కడో ఒక చోట హై పాయింట్ కోసం ఎదురు చూసే ప్రేక్షకుడు తీవ్రంగా కలత చెందే విధంగా క్లిమాక్స్ కి చేరుకుంటుంది సినిమా.

ఒక మంచి పాయింట్ ని సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యకుండా సినిమాని చుట్టేసిన శ్రీకాంత్ అడ్డాల కే ఈ సినిమా ప్లాప్ అయితే పాపం దక్కుతుంది.ఫామిలీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాని బట్టి రెవెన్యూ ఉంటుంది.

రేటింగ్: 2.75/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube