ఆమెకు ఐదోసారి కూడా పాజిటివ్, ఏమీ పర్లేదు అంటున్న డాక్టర్లు

ప్రముఖ

బాలీవుడ్ గాయని కనికా కపూర్

కు ఐదో సారి కూడా

కరోనా పాజిటివ్

రావడం కలవరం సృష్టిస్తుంది.కరోనా వైరస్ ఆమెను అంత ఈజీ గా వదలట్లేదు అని చెప్పాలి.

 Kanika Kapoor Tests Positive For Covid-19 For The Fifth Time, Doctor Says There-TeluguStop.com

ఇప్పటివరకు నాలుగు సార్లు ఆమె కు కరోనా పరీక్షలు నిర్వహించగా నాలుగు సార్లు కూడా పాజిటివ్ అనే వచ్చింది.ఒకసారి

కరోనా

సోకిన తరువాత ప్రతి 48 గంటలకు ఒకసారి టెస్ట్ నిర్వహిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఐదోసారి కూడా కరోనా టెస్ట్ నిర్వహించగా ఈ సారి కూడా పాజిటివ్ రావడం భయాందోళన కలిగిస్తుంది.మరోపక్క వైద్యులు మాత్రం కరోనా పాజిటివ్ వచ్చింది కానీ పరిస్థితి మాత్రం మామూలుగానే ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం కనికా

ఉత్తరప్రదేశ్

లక్నో లో ఉన్న

సంజయ్ గాంధీ

ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న విషయం తెలిసిందే.మార్చి 9 న లండన్ నుంచి లక్నో కు వచ్చిన కనికాకు ఎయిర్ పోర్ట్ లోనే అధికారులు చెక్ చేయగా జ్వరం ఉన్నట్లు తేలింది.

దీనితో హోం క్వారంటైన్ ఉండాలి అని అధికారులు సూచించారు.

అయితే లక్ష్యపెట్టని కనికా పార్టీ కూడా నిర్వహించి పలువురు రాజకీయ ప్రముఖులను పిలిచింది.

అనంతరం ఆమెకు ఫ్లూ లక్షణాలు కనిపించడం తో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించగా

కరోనా పాజిటివ్

అని రావడం తో మార్చి 20 న ఆసుపత్రిలో జాయిన్ అయ్యింది.అయితే పది రోజుల ట్రీట్మెంట్ తరువాత ఆమెకు తిరిగి పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజిటివ్ అనే వచ్చింది.

అయితే ఆమె కు పాజిటివ్ వచ్చినప్పటికీ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.ఆమె ఆరోగ్యం బాలేదని మీడియాలో వస్తున్న ప్రచారం నిజం కాదంటున్నారు.మార్చి 20 న ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆమెకు అప్పటి నుంచీ ట్రీట్‌మెంట్ చేస్తున్నా… పరిస్థితిలో మెరుగుదల కనిపించట్లేదు.దీనిపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విదేశం నుంచి వచ్చి…

క్వారంటైన్‌

లో ఉండకుండా పార్టీలు నిర్వహించినందుకు మరోపక్క పోలీసులు కనికాపై కేసు కూడా నమోదు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube