టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్రపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.నాయకత్వం అంటే స్వయంగా ప్రకాశించాలని చెప్పారు.
అంతేకానీ బలవంతంగా రుద్ది నాయకత్వాన్ని ప్రదర్శించకూడదని తెలిపారు.లోకేశ్ యువగళం యాత్రపై ప్రజల నుంచి పాజిటివ్ న్యూస్ కంటే నెగెటివ్ న్యూసే ఎక్కువగా వస్తున్నాయన్నారు.
ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రజలే అంతిమ నిర్ణేతలు అని పేర్కొన్నారు.లోకేశ్ పాదయాత్ర స్థానికంగా కూడా సరైన రీతిలో సాగుతున్నట్లు అనిపించడం లేదంటూ జీవీఎల్ వ్యాఖ్యనించారు.