బీజేపీ ఎన్ని ఛార్జ్ షీట్లు పెట్టినా భయపడేది లేదని ఎమ్మెల్సీ భానుప్రకాశ్ అన్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో బీఆర్ఎస్ నేతలకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు.
బీజేపీ ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేసినా తమ పోరాటం ఆగదని తెలిపారు.బీజేపీలో అంతర్గత కలహాలు పెరిగాయని పేర్కొన్నారు.
ఈటలను అడగటం లేదనే నైరాశ్యంతో వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.కేంద్రం ఎందుకు అప్పుులు చేసిందో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఈటల కేంద్రం నుంచి హుజురాబాద్ కు ఎన్ని నిధులు తెచ్చారో కూడా చెప్పాలన్నారు.అసైన్డ్ ల్యాండ్ కొన్నప్పుడు ఎక్కడికి పోయాయి ఈ విమర్శలు అని భానుప్రకాశ్ ప్రశ్నించారు.