తొక్కలో సంచాలక్... బొక్కలో జడ్జిమెంట్ అంటూ అమర్ దీప్ పై ఫైర్ అయిన నాగార్జున?

బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7 ) కార్యక్రమం ప్రస్తుతం 4 వారాలను పూర్తి చేసుకుని హౌస్ నుంచి నలుగురు కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు.ప్రస్తుతం ఐదవ వారం కొనసాగుతున్న సంగతి మనకు తెలిసిందే.

 Bigg Boss Host Nagarjuna Fire On Amardeep Details, Bigg Boss, Nagarjuna, Amardee-TeluguStop.com

ఇకపోతే ప్రతి వీకెండ్ నాగార్జున (Nagarjuna) హౌస్మెట్లతో మాట్లాడుతూ వారి తప్పొప్పుల గురించి వారిని నిలదీస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా విడుదల చేసిన ప్రోమో చూస్తే కనక మరోసారి నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లపై సీరియస్ అయ్యారని తెలుస్తుంది.

తాజా ప్రోమో ప్రకారం నాగార్జున హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ సందీప్(Sandeep), అమర్ దీప్ (Amar Deep) పై గ్రహం వ్యక్తం చేశారు.

Telugu Amardeep, Bigg Boss, Nagarjuna, Telugu Season-Movie

తాజా ప్రోమో ప్రకారం ఇప్పటికే హౌస్ మెట్లను జోడీలుగా విడదీసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే నాగార్జున యావర్, టేస్టీ తేజ జోడిని మెచ్చుకున్నారు.తేజ ఎంటర్టైన్ చేస్తానని మాట ఇచ్చావు ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకున్నావని నాగార్జున ఆయనని పొగడ్తలతో ముంచేశారు.

ఇక అమర్ గురించి నాగార్జున మాట్లాడుతూ ఆయన టాస్క్ మధ్యలో వ్యవహరించిన తీరు పట్ల నాగార్జున తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.అమర్ టాస్క్ కంప్లీట్ కాకుండా బెల్ కొట్టడం కరెక్టేనా అంటూ ప్రశ్నించగా దానికి అమర్ ఏదోదో సమాధానాలు చెప్పారు.

మీ తెలివితేటలు పరాకాష్టకు చేరుకున్నాయి అంటూ సంబంధించినటువంటి వీడియోని చూపించారు.

Telugu Amardeep, Bigg Boss, Nagarjuna, Telugu Season-Movie

అనంతరం ఈ టాస్క్ సంచాలక్( Sanchalak ) ఎవరు అంటూ నాగార్జున ప్రశ్నించగా ఎవరూ లేరు అంటూ సమాధానం చెబుతారు.కానీ నాగార్జున అమర్ దీప్ నువ్వు సంచాలక్ అంటూ సమాధానం చెబుతారు.నువ్వు మాటిమాటికి బొక్కలో జడ్జిమెంట్ అంటావు కదా నీది కూడా తొక్కలో సంచాలక్ బొక్కలో జడ్జ్ మెంట్ అంటూ నాగార్జున అమర్ దీప్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంతటితో ఈ ప్రోమో పూర్తి అవుతుంది.మరి ఈ వారం ఏ కంటెస్టెంట్ కి ఏ విధంగా నాగార్జున కౌన్సిలింగ్ ఇవ్వబోతున్నారు ఇక హౌస్ నుంచి ఈ వారం ఎవరు బయటకు రాబోతున్నారన్న విషయాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube