టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటీమణులలో పూజా రామచంద్రన్( Pooja Ramachandran ) ఒకరు.స్వామిరారా సినిమా( Swamyrara ) నిఖిల్ పక్కనే కనిపించే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
తాజాగా ఈ ప్రముఖ నటి పండంటి మగబిడ్డకు( Baby Boy ) జన్మనిచ్చారు.పూజా రామచంద్రన్ భర్త జాన్ కొక్కెన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను పంచుకున్నారు.
బాబు వేలిని పట్టుకున్న ఫోటోను జాన్ కొక్కెన్ షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ ఫోటో తెగ వైరల్ అవుతోంది.ఈ బిడ్డకు అప్పుడే పేరు కూడా ఫిక్స్ చేయడం గమనార్హం.
తమ బిడ్డకు కియాన్ కొక్కెన్ అని పేరు పెట్టినట్టు జాన్ కొక్కెన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.అభిమానులు తమపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞుడినని ఆయన కామెంట్లు చేశారు.
పూజా రామచంద్రన్ బిగ్ బాస్ షో ద్వారా కూడా ఊహించని స్థాయిలో పాపులారిటీ తెచ్చుకున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు పేరు చెబితే ఆమెను గుర్తు పడతారో లేదో కచ్చితంగా చెప్పలేం కానీ ఆమె ఫేస్ చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తుపడతారని చెప్పవచ్చు.పవర్ ప్లే, వెంకీ మామ, దళం, దోచేయ్, కాంచన2 సినిమాలు తెలుగులో పూజా రామచంద్రన్ కు మంచి పేరును తెచ్చిపెట్టాయి.పూజా రామచంద్రన్ భర్త జాన్ కొక్కెన్ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటుడు కావడం గమనార్హం.
వీరసింహారెడ్డి సినిమాలోని పాత్ర జాన్ కొక్కెన్ కు మంచి పేరును తెచ్చిపెట్టింది.పూజా రామచంద్రన్ పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.పూజా రామచంద్రన్, జాన్ కొక్కెన్ కలకాలం సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.పూజా రామచంద్రన్ తెలుగులో మరిన్ని ఆఫర్లతో బిజీ కావాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.