ఈ సీజన్ బిగ్ బాస్( Big Boss ) హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి నేటి వరకు శివాజీ బీభత్సంగా ఆడిన టాస్కులు చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు.ఒక్కసారి ఆయన స్మైల్ టాస్కు ఆడినప్పుడు భుజానికి దెబ్బ తగిలింది.
అప్పటి నుండి ప్రతీ టాస్క్ కి సంచాలక్ వ్యవహరిస్తూ వస్తున్నాడు.కేవలం సంచాలక్ గా మాత్రమే కాదు, పక్క వాళ్ళను ప్రభావితం చెయ్యడం లో ఇతనిని మించిన వాడు బిగ్ బాస్ హిస్టరీ లోనే లేడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రశాంత్ , యావర్ , రతికా, తేజా, అశ్విని ఇలా హౌస్ లో ఉన్న ప్రతీ ఒక్కరిని తన గ్రిప్ లో పెట్టుకొని గ్రూప్ గేమ్స్ తెగ ఆడేస్తున్నాడు.హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఇతనికి అమర్ దీప్ అంటే ఇష్టం లేదనే విషయం జనాలందరికీ అర్థం అయ్యింది.
దానిని కప్పి పుచ్చడానికి ఇతను చేసే ప్రయత్నాలు మామూలివి కాదు.
ఇతనికి బాగా ఇష్టమైన కంటెస్టెంట్స్ పల్లవి ప్రశాంత్( Pallavi prashanth ) మరియు యావర్.మీ ఇద్దరి కోసమే నేను హౌస్ లో ఉంటున్నాను అంటూ ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడుతాడు శివాజీ.వాళ్ళిద్దరికీ అడ్డం గా అమర్ దీప్ ఉన్నాడని బహుశా ఆయన ఫీలింగ్ అవ్వొచ్చు, అందుకే ప్రతీ వారం నామినేషన్స్ లో అమర్ దీప్ ని నామినేట్ చేస్తూ వస్తున్నాడు.
నిన్న నామినేషన్స్ పర్వం ఎంత వాడావేడి వాతావరణం లో జరిగిందో మన అందరికీ తెలిసిందే.శివాజీ ఈ నామినేషన్స్ దగ్గరే అడ్డంగా దొరికిపోయాడు.అమర్ దీప్ ని( Amardeep Chowdary ) నామినేట్ చేస్తూ నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నావు, నామినేషన్స్ సమయం లో వేరేలా ఉంటున్నావు, అది నాకు నచ్చని పాయింట్స్ లో ఒకటి అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని అంటాడు.అప్పుడు పల్లవి ప్రశాంత్ మొదటి వారం నుండి నామినేషన్స్ సమయం లో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం వంటివి చేస్తూనే ఉన్నాడు, వాడికి కూడా ఇలా చెప్పి నామినేట్ ఎందుకు చెయ్యలేదు అని అంటాడు.
దానికి శివాజీ సమాధానం చెప్తూ ‘నేను వాడికి చెప్పాను, చాలా మారాడు కూడా’ అని అంటాడు.దానికి అమర్ దీప్ ఎక్కడ మారాడు?, గత వారం లో వాడి ప్రవర్తన నామినేషన్స్ సమయం లో కోట్లాది మంది తెలుగు ప్రజలు చూసారు, ఈరోజు కూడా వాడు నాతో ఎలా మాట్లాడాడో ఇక్కడ ఉన్న వాళ్లంతా చూసారు, ఇది మారినట్టా? అని శివాజీ ని అడగగా, శివాజీ సమాధానం చెప్పలేక ఇక నేను నీతో వాదించలేనురా, నీ పాయింట్స్ చెప్పి నామినేషన్స్ వేసి వెళ్ళిపో అని అంటాడు.అంతే కాకుండా టేస్టీ తేజ ని నామినేట్ చేస్తూ కూడా శివాజీ మరోసారి దొరికిపోయాడు.సందీప్ నువ్వు నామినేషన్ వెయ్యడం వల్లే ఎలిమినేట్ అయ్యాడు అని చెప్పి నామినేట్ చేస్తాడు.
వీకెండ్ లో సందీప్ నామినేట్ ఎలిమినేట్ అయ్యినప్పుడు తేజా బాగా ఏడుస్తాడు, అప్పుడు శివాజీ తేజా ని ఓదారుస్తూ బాధపడకు, నువ్వు నామినేషన్స్ వెయ్యడం వల్లే సందీప్ ఎలిమినేట్ అవ్వలేదు, ఆడియన్స్ నచ్చినన్ని రోజులు హౌస్ లో ఉంటాం తర్వాత వెళ్ళిపోతాం అని ఓదారుస్తాడు.అలా ఓదార్చిన ఆయనే నేడు ఆ కారణాలు చెప్పి నామినేట్ చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.