తెలుగులో బిగ్ బాస్ షో కి ఉన్న క్రేజ్, ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా ప్రసారమవుతున్నప్పటికీ తెలుగులో భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది బిగ్ బాస్ షో.
ఇకపోతే ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది బిగ్ బాస్ షో.కాగా ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే.మొదట 21 మంది కంటెస్టెంట్లతో ఇటీవలే గ్రాండ్గా మొదలైన బిగ్ బాస్ షో చూస్తుండగానే అప్పుడే ముగింపు దశకు చేరుకుంది.కాగా ప్రస్తుతం హౌస్ లోకి కేవలం 9 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు.
వారిలో టాప్ ఫైవ్ లోకి ఐదుగురు ఎంట్రీ ఇవ్వనుండగా మిగిలిన నలుగురు కంటెంట్లు ఎలిమినేట్ కానున్నారు.
బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంటుండడంతో వారం వారం మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఇక బిగ్ బాస్ హౌస్ లో రేపు మాపో టికెట్టు ఫినాలే ఎపిసోడ్లు కూడా ప్రారంభం కానున్నాయి.కాగా ఇప్పటికే 12వ వారం హౌస్ మేట్స్ కు బూస్ట్ ను ఇవ్వడం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్.
ఇది ఇలా ఉంటే మరొకవైపు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అరియానా బిగ్ బాస్ కేఫ్ కి ఎవర్నో ఒకని పిలిచి డిబేట్ పెడుతూనే ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్‌బాస్ కేఫ్ కు మాజీ కంటెస్టెంట్ హమీదా ఎంట్రీ ఇచ్చింది.
ఈ సందర్భంగా హామీదా మాట్లాడుతూ.
శ్రీ సత్యకు దండం పెట్టాలి.ఆమె ఎలిమినేట్ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను.ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిది అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేసింది.
తన పేరెంట్స్ మాత్రం ఇనయకు పెద్ద ఫ్యాన్స్ అని చెప్పుకొచ్చింది హామీదా.అప్పుడు అరియానా మాట్లాడుతూ అది సరే కానీ శ్రీసత్య ఎప్పుడు ఎలిమినేట్ అవుతుందా? అని ఎదురుచూస్తున్నావా? అంటూ కౌంటర్ ఇవ్వడంతో వెంటనే హామీదా లేదు అన్నట్టుగా నో అంటూ తల పట్టుకుంది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.