టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరో భాను చందర్ గురించి ప్రేక్షకులకి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే అందరికీ భానుచందర్ అంటే ముందుగా గుర్తొచ్చేది “జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై” అనే పాట.
అయితే భానుచందర్ తెలుగు మరియు తమిళ భాషల్లో దాదాపు వంద చిత్రాల్లోకి పైగా నటించి తెలుగు ప్రేక్షకులను అటు తమిళ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.అయితే ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అందుబాటులో ఉన్నాడు.
అయితే తాజాగా భానుచందర్ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన సినీ జీవితంలోని కొన్ని అంశాలను ప్రేక్షకులకు పంచుకున్నాడు.ఇందులో తనకు తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి మంచి స్నేహితుడని తెలిపాడు.అంతేగాక ఇప్పటికీ కూడా మెగాస్టార్ చిరంజీవితో తనకి మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చాడు.
అలాగే గతంలో తనకు ద్విచక్ర వాహనం నడపడం రాదని ఈ విషయం తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి తన తోటి మిత్రుడు మోటార్ సైకిల్ ని తీసుకొని నాకు వెంటనే దాన్ని ఎలా నడపాలో నేర్పించాడని పాత రోజులు గుర్తు చేసుకున్నాడు.అంతేకాక అప్పట్లో చిరంజీవిని ఒరేయ్, అరేయ్, అంటూ సంబోధించే అంత సన్నిహిత్యం తమ మధ్య ఉండేదని కూడా తెలిపాడు.
అయితే రాను రాను చిరంజీవి తన జీవితంలో బిజీ అయ్యాడని తాను కూడా తన వ్యక్తిగత పనుల్లో బిజీగా ఉండటంతో ఈ మధ్య తరచూ కలవలేక పోతున్నామని అన్నారు.కానీ ప్రతీ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా తన స్నేహితులంతా కలిసి సరదాగా గడుపుదామని గత సంవత్సరం కూడా చిరంజీవి తో సరదాగా గడిపామని చెప్పుకొచ్చాడు.అలాగే చిరంజీవి చాలా సరదాగా ఉంటాడని అంతేగాక తమ అనుకున్న వారి కోసం ఏదైనా ఏమైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని తెలిపాడు.అటువంటి వ్యక్తి తనకు ఆప్త మిత్రుడుగా ఉండడం ఎంతో సంతోషకరమని చిరంజీవిపై ప్రశంసలు కురిపించాడు.