గోరువెచ్చని నీటితో స్నానం.. ఎన్నో ప్రయోజనాలు

స్నానం చేయడంతో శరీరం ఉల్లాసంగా మారుతుంది.తెల్లవారుజామున చల్లని నీటితో స్నానం చేస్తే రోజంతా యాక్టివ్ గా ఉంటారని నానుడి.

అందుకే చాలా మంది ప్రజలు, దేవాలయాల్లో పంతులు సూర్యుడు ఉదయించే ముందే స్నానం చేసుకుంటారు.ఉదయం పూట, రాత్రి పడుకునే ముందు కూడా చాలా మందికి స్నానం చేసే అలవాటు ఉంటుంది.

తరచూ స్నానం చేస్తూ మానసిక ప్రశాంతతను పొందుతుంటారు.మంచి నిద్రను కావాలనుకునే వారు రాత్రి సమయంలో స్నానం చేస్తుంటారు.

రాత్రి సమయంలో మాములు నీళ్లకు బదులు గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు అంటున్నారు.రాత్రి వేళలో గోరువెచ్చని నీటితో స్నానం చేసినట్లయితే త్వరగా నిద్ర పడుతుందని, శరీర కండరాలు విశ్రాంతిని పొంది గాఢ నిద్ర పడుతుందని నిపుణులు వెల్లడించారు.

Advertisement

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారు రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయాలని సూచిస్తున్నారు.రక్తపోటు అధికంగా ఉండే వారు కూడా రాత్రి పూట స్నానం చేయడం వల్ల రక్తపోటు నియంత్రణలోకి వస్తుందని నిపుణులు తెలిపారు.టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న వాళ్లు కూడా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలని, శరీరంలో ఆందోళన, ఒత్తిడి, కండరాలు విశ్రాంతి అయి మంచి నిద్ర పడుతుందన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు