బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి బిగ్ బాస్ ( Bigg Boss ) కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే.ఇలా బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఈ కార్యక్రమం హిందీ కన్నడ తమిళ తెలుగు భాషలలో ప్రసారమవుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.
అయితే తెలుగులో ప్రస్తుతం ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారం కాగా ఈ సీజన్ కూడా అప్పుడే 9వ వారం కొనసాగుతోంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ కార్యక్రమానికి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.సీజన్ 2 నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అప్పటినుంచి ఇప్పటివరకు నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.అయితే వచ్చేసి సీజన్ కి మాత్రం నాగార్జున( Nagarjuna ) స్థానంలో మరొక స్టార్ హీరోని తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావించారట.
అన్ని భాషలతో పోలిస్తే తెలుగులోనే ఈ కార్యక్రమానికి కాస్త రేటింగ్ తక్కువగా వస్తుందని తెలుగులో కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకోవడానికి కొన్ని కీలక మార్పులు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.
ఇందులో భాగంగానే ముందుగా హోస్ట్ విషయంలో కూడా మార్పులు తీసుకురావాలని భావించారట.అందుకే నాగార్జున స్థానంలో నందమూరి నటసింహం బాలకృష్ణను(Balakrishna) వ్యాఖ్యాతగా తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావించి ఆయనని కలిసారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ ( Unstoppable ) కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి బాలకృష్ణ ఈ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ తీసుకోవచ్చారు.
ఇలా ఈ కార్యక్రమానికి మంచి గుర్తింపు రావడంతో వచ్చే సీజన్ లో బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా నాగార్జున స్థానంలో బాలకృష్ణను వ్యాఖ్యాతగా తీసుకోవాలని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది.మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.