అద్భుతం.. గాలిపటాలతో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేస్తున్న స్కాట్లాండ్ వ్యక్తి..

ఈ మోడ్రన్ వరల్డ్ లో కరెంటు లేనిదే పూట గడవదు అంటే అతిశయోక్తి కాదు.ప్రపంచం మొత్తం ఒక వారం రోజులపాటు విద్యుత్ నిలిచిపోతే ఎన్ని పనులు ఆగిపోతాయో ఊహకి కూడా అందదు.

 Awesome Scotland Man Producing Electricity With Kites, Kites, Electricity Genera-TeluguStop.com

అయితే మనుషులతో పాటు విద్యుత్ అవసరాలు కూడా అంతకంతకూ పెరిగి పోతుండటంతో ఎలక్ట్రిసిటీ కొరత ఏర్పడుతోంది.ఈ కొరతకు పరిష్కారంగా ఇప్పటికే నీరు, సూర్యరశ్మి, గాలి ఇతర మార్గాల్లో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నారు.

అయినా కూడా విద్యుత్ ఉత్పత్తిని ఇంకా పెంచాల్సిన అవసరం ఏర్పడుతోంది.ఈ నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి చేసే మరిన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు శాస్త్రవేత్తలు.

ఈ క్రమంలోనే తాజాగా ఒక స్కాట్లాండ్ వ్యక్తి గాలి పటాల ద్వారా విద్యుత్ ని జనరేట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు.

వివరాల్లోకి వెళితే, స్కాట్లాండ్ దేశానికి చెందిన రాడ్ అనే వ్యక్తి గాలిపటాలతో విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీని కనిపెట్టాడు.

గాలిమరల సాయంతో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు.గాలి పటాల ద్వారా ఎందుకు తయారు చెయ్యలేమనే ఆలోచన నుంచి ఈ సరికొత్త ఆవిష్కరణ అవతరించింది.

ఫ్లయింగ్‌ టర్బైన్‌ అని ఈ కొత్త టెక్నాలజీని పిలుస్తారు.

సాధారణంగా గాలి పటాలు గాలిలో ఎగురుతున్న సమయంలో కొంత శక్తి విడుదల అవుతుంది.

ఈ శక్తిని కింద ఉండే గ్రౌండ్‌ స్టేషన్‌ విద్యుత్‌గా ఫ్లయింగ్ టర్బైన్ టెక్నాలజీ మారుస్తుంది.ఇలా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు కర్బన ఉద్గారాలు రిలీజ్ అయ్యేది చాలా తక్కువేనట.

అయితే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలంటే గాలిపటాలు 200 మీటర్ల నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఎగరాల్సి ఉంటుంది.పది కిలోమీటర్ల ఎత్తులో ఈ గాలి పటాలు నిత్యం ఎగురుతూ ఉంటే విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది.

ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్ ఒక ఇంటికి సరిపోతుంది.ఇళ్ళకు మాత్రమే కాదు ఇదే టెక్నాలజీని ఉపయోగించి ఎక్కడైనా సరే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చని ఆవిష్కర్త చెబుతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube