అవసరాలని కథ మార్చమంటున్న నిర్మాతలు

నటుడుగానే కాకుండా దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అవసరాల శ్రీనివాస్ తన మూడో సినిమాని కూడా నాగ శౌర్యతోనే తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది.

 Avasarala Change The Story Of Naga Shourya Movie, Tollywood, Telugu Cinema, Sout-TeluguStop.com

ఇక ఇక ఈ సినిమా కథ ఇండియాలో మొదలై అమెరికా వెళ్తుంది.అక్కడ మెజారిటీ కథ నడుస్తుంది.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అమెరికాలో షూటింగ్ పెట్టడం అంత శ్రేయస్కరం కాదు.మళ్ళీ విదేశాలలో షూటింగ్ అంటే కనీసం ఏడాదికి పైగా అది కూడా కరోనా కంట్రోల్ వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే.

ఇలాగే ఉంటే ఇక సినిమా నిర్మాతలకి నష్టాలు తప్పవు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు అవసరాల కథని మార్చాల్సిందిగా నిర్మాతలు ఒత్తిడి తెస్తున్నారు.

అమెరికా ప్రస్తావన లేకుండా కథ మొత్తం ఇండియాలోనే సాగే విధంగా మరల కథనంలో మార్పులు చేయాలని సూచించడం జరిగింది.ఇక అవసరాల కూడా నిర్మాతల నిర్ణయాన్ని ప్రస్తుత పరిస్థితిలో కాదనలేని స్థితి.

అందుకే మరల ఈ కథకి కొత్త వెర్షన్ రాసే పనిలో పడ్డట్లు తెలుస్తుంది.మరి మొదటి, రెండు సినిమాల తరహాలో ఇక్కడే కథని నేరేట్ చేయడానికి అవసరాల ఎలాంటి మార్పులు చేస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube