నేను అలా మాట్లాడలేదు అంటున్న రతన్ టాటా

దేశంలో ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తుంది.ఈ లాక్ డౌన్ కారణంగా కొంత కంట్రోల్ లో ఉన్న మెల్లగా కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

వీటిని నియంత్రించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టి లాక్ డౌన్ ని ఈ నెల ఆఖరు వరకు పొడిగించే ఆలోచనలో ఉంది.అయితే ఇలాంటి సమయంలో కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో కొంత మంది వ్యక్తులు అదే పనిగా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు.

ప్రముఖుల పేర్లు ప్రస్తావిస్తూ వారు అన్ని మాటలు అన్నట్లు చెబుతున్నారు.అలాంటి ఒక తప్పుడు కథనంపై వ్యాపార దిగ్గజం రతన్ టాటా క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

కరోనా మహమ్మారి కారణంగా ఇండియా ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారని రతన్ టాటా అన్నట్లు ఒక న్యూస్ సర్క్యూలేట్ అయ్యింది.దీనిని సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేశారు.

Advertisement

ఈ వార్తలో ఎలాంటి వాస్తవం లేదని రతన్ టాటా ఖండించారు.తాను అటువంటి వ్యాఖ్యలు చేయలేదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసిన ఆయన, అది ఓ నకిలీ వార్తని, దాన్ని నమ్మవద్దని కోరారు.

తాను ఎన్నడూ అటువంటి ప్రకటన చేయలేదని తెలిపారు.వార్తల్లో నిజానిజాలేంటో మీడియా ధ్రువీకరించుకోవాలని కోరారు.

వాట్స్ యాప్ తదితర సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మవద్దని కోరారు.తాను ఏదైనా చెప్పాల్సి వస్తే, మీడియాతో నేరుగా చెబుతానని అన్నారు.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు