కొండ అంచున ఇల్లు.. నివ్వెరపోతున్న నెటిజన్లు

ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంటుంది.కొందరికి పెద్ద పెద్ద బంగ్లాలు కొనాలని.

 Australia Man Built Home At The Edge Of Mountain Cliff Details, Mountain House,-TeluguStop.com

కొందరికి పెద్ద పెద్ద ఇల్లు కట్టించుకోవాలనే ఆలోచనలు ఉంటాయి.ఇక కొందరికి తమను ఇతరులు చూడాలని.

అందుకు భిన్నంగా కనపడేందుకు తాము ధరించే దుస్తులు, చెప్పుడు, ఆభరణాలు దగ్గర నుండి.తాము నివసించే ఇల్లు, గది, ప్రయాణించే వాహనాలు అన్నీ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు.

ముఖ్యంగా ధనవంతులు అయితే తమకు నచ్చిన స్టైల్‌లో తమ దుస్తులను, ఇళ్లను సెపరేట్ గా డిజైన్ కూడా చేయించుకుంటారు.అందుకోసం ఎంత ఖర్చు అయినా వెనుకాడరు.

ఓ వ్యక్తి కూడా అలాగే ఆలోచించాడు.ప్రపంచమే నివ్వెర పోయేలాంటి ఇంటిని నిర్మించుకున్నాడు.

అది ఇప్పుడు చాలా స్పెషల్ హౌస్‌గా మారింది.

ఆస్ట్రేలియాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త తాను ఏం చేసినా స్పెషల్‌గా ఉండాలనుకుంటాడు.

అందులో భాగంగానే.తన నివాస గృహం కూడా చాలా స్పెషల్‌గా ఉండాలని భావించి.

అందుకోసం ప్రణాళికలు రచించాడు.ఎవరూ ఊహించని ప్లేస్‌లో ఇంటి నిర్మాణం చేయాలని ఫిక్స్ అయ్యాడు.

సాధారణంగా అయితే సముద్రం ఒడ్డున ఇల్లు కట్టుకుని బీచ్ అందాలను ఎంజాయ్ చేయాలని.సన్ రైస్‌ను చూస్తూ బతికేయాలని అందరూ అనుకుంటారు.

ఇతను కూడా అలాగే భావించాడు.అందుకే.

సముద్రం ఒడ్డున ఉన్న ఓ భారీ కొండ అంచున ఇల్లు నిర్మించుకోవాలని డిసైడ్ అయ్యాడు.

తానూ నిర్మించుకోబోయే ఇంటి ప్లేస్ కింద సముద్రం.

పైన ఆకాశం ఉండేలా ప్లేస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు.

Telugu Advanced, Australia, Cliff, Edgemountain, Mountain, Latest-Latest News -

ఇల్లు మాత్రం కొండ అంచున సముద్రంలో వేలాడుతున్నట్లుగా ఉండాలి.ఇదీ అతని ప్లాన్.ఇంకేముంది.

ఏమాత్రం ఆలస్యం చేయకుండా.ఆ ప్లేస్‌లో ఇల్లు కట్టేందుకు ఓ ఆర్టిటెక్ సంస్థను కలిశారు.

ఆస్ట్రేలియా ఆర్కిటెక్చర్ సంస్థ మోడ్‌స్కేప్ సంస్థ అతను కోరిన విధంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు సై అంది.అత్యాధునిక టెక్నాలజీలో ఈ ఇల్లు నిర్మాణం పూర్తి చేశారు.

పూర్తిగా గాలిలో తేలియాడుతున్నట్లుగా ఉన్న ఈ ఇంట్లో 5 ఫోర్లు ఉన్నాయి.పై ఫ్లోర్ మొత్తం కూడా కారు పార్కింగ్‌ కోసం సెట్ చేశారు.

మిగిలిన నాలుగు ఫ్లోర్లలో బెడ్‌ రూమ్, వాష్ రూమ్, కిచెన్ ఉన్నాయి.ఈ ఇంటిని చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

భయానకంగా ఉన్న.చాలా అద్భుతంగా ఉందంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube