ఎప్పటి నుంచో రెండు తెలుగు రాష్ట్రాలు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.కొంత కాలం క్రితం అసెంలి సీట్ల పెంపుపై హడావుడి చేసిన కేంద్రం ఆ తరువాత సైలెంట్ అయిపొయింది.వాస్తవంగా… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం మేరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను ఎప్పుడో పెంచాలి.కానీ అది అలా పెండింగ్ పడుతూ వస్తోంది.
కానీ ఈ అంశంపై మళ్లీ కదలిక మొదలైంది.ఈ అంశాన్ని పెండింగ్లో పెట్టిన కేంద్ర హోం శాఖ ప్రక్రియను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం.
సీట్ల పెంపుపై శాఖాపరంగా చర్చిస్తూనే కేంద్ర ఎన్నికల సంఘం, జనాభా లెక్కల రిజిస్ట్రార్ జనరల్తోనూ ఈ విషయంపై సంప్రదింపులు చేస్తోంది.
జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించాలన్న అంశంపైనా తర్జనభర్జనలు జరుగుతున్నాయి.2001 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని రిజిస్ట్రార్ జనరల్ నివేదిక అందించినట్లు సమాచారం.కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను ఖరారు చేయాలని హోం శాఖ నిర్ణయించుకున్నట్లు తెలిసింది.
రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లపై జనాభాపరంగా ప్రభావం పడుతుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను గుర్తించడానికి అభిప్రాయాలు చెప్పాలని ఈసీని కోరినట్లు తెలుస్తోంది.
రిజర్వుడు సీట్లను 2011 లెక్కల ప్రకారం ఖరారు చేసి.
సాధారణ సీట్లకు 2001 లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే వివాదమవుతుందా? న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయా.? అభ్యంతరాలు వస్తే ఏం చేయాలి.? రిజర్వ్డ్, సాధారణ సీట్లకు ఒకే జనాభా లెక్కలు తీసుకుంటే ఎలా ఉంటుంది.? వంటి అంశాలను హోంశాఖ వర్గాలు పరిశీలిస్తున్నాయి.మరోవైపు కేవలం రాష్ట్ర విభజన చట్టం సవరణ ద్వారా మాత్రమే సీట్లు పెంచాలని వస్తున్న వాదనలను హోంశాఖ పరిగణనలోకి తీసుకోవట్లేదని తెలిసింది.న్యాయనిపుణుల సలహాల మేరకే ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలిసింది.
సీట్లను పెంచాలంటే రాజ్యాంగంలోని 170వ అధికరణను సవరించాలని ఇప్పటికే అటార్నీ జనరల్ ప్రభుత్వానికి నివేదిక అందించిన సంగతి తెలిసిందే.దాని ప్రకారమే నడుచుకోవాలని నిర్ణయించారని హోంశాఖ వర్గాలు చెప్పాయి.ఈ ప్రకారం ముందుకెళితే 170వ అధికరణతో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది.పార్లమెంటు సవరణలు ఆమోదిస్తే రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న 175 సీట్లు 225కి, తెలంగాణలోని 119 సీట్లు 153కి పెరుగుతాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావడంతో కేంద్ర నిర్ణయం ప్రకారం ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే సీట్ల పెంపు ఉండబోతున్నట్టు తెలుస్తోంది.‘‘అసెంబ్లీ సీట్ల పెంపుపై నవంబరు, డిసెంబరులో జరిగే శీతాకాల సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరిస్తే సరిపోతుందని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి.
రాజ్యాంగ సవరణ అవసరమని అటార్నీ జనరల్ ఇప్పటికే నివేదిక అందించారని ఆ వర్గాలు తెలిపాయి.చట్ట సవరణ లేదా రాజ్యాంగ సవరణ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో జరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి.
అప్పుడు ఆమోదం లభిస్తే మూడు నెలల్లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తర్వాతే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని చెబుతున్నాయి.అంటే.
‘‘తెలంగాణలో 2023లోనే పెరిగిన సీట్లలో ఎన్నికలు జరుగుతాయి.ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2019 ఏప్రిల్లోనే జరుగుతాయి.