దర్శకధీరుడు రాజమౌళి తనయుడు కార్తికేయ వివాహ నిశ్చితార్థం ఇటీవలే జరిగిన విషయం తెల్సిందే.జగపతిబాబు అన్న కూతురు పూజాతో కార్తికేయ చాలా రోజులుగా ప్రేమలో ఉన్నాడు.
వీరిద్దరి ప్రేమను పెద్దలు ఒప్పుకుని వివాహ నిశ్చితార్థం చేశారు.త్వరలోనే పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.
వీరి వివాహం రెగ్యులర్ వివాహాల మాదిరిగా కాకుండా భిన్నంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.రెగ్యులర్ వివాహాల మాదిరిగా పందిర్లు, సన్నాయి మేళ్లాలు వంటివి లేకుండా డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కార్తికేయ ప్లాన్ చేస్తున్నాడు.
కార్తికేయ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ కూడా గతంలో నిర్వహించిన విషయం తెల్సిందే.అందుకే తన పెళ్లిని అత్యంత అద్బుతంగా ప్లాన్ చేసుకోవాలని కార్తికేయ భావిస్తున్నాడు.దాదాపు వారం రోజులు విదేశాల్లో ఈ వివాహం జరుగనున్నట్లుగా సమాచారం అందుతుంది.తాను డెస్టినేషన్ వివాహంకు సిద్దం అయినట్లుగా స్వయంగా కార్తికేయ సోషల్ మీడియాలో ప్రకటించాడు.అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయంపై మాత్రం కార్తికేయ క్లారిటీ ఇవ్వలేదు.త్వరలోనే తేదీ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
డెస్టినేషన్ మ్యారేజ్ అంటే క్రిస్టియన్ తరహాలో ఈ వివాహం ఉంటుంది.అయిదు నుండి ఏడు రోజుల పాటు వరుసగా ఏదో ఒక వేడుక జరుపుకుంటూ కొత్త దంపతులతో కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తారు.
ఈ పెళ్లిలో చాలా తక్కువ మంది గెస్ట్‌లు పాల్గొంటారు.కార్తికేయ చేసుకోబోతున్న ఈ పెళ్లిలో కేవలం 75 నుండి 100 మంది మాత్రమే పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈమద్య బాగా డబ్బు ఉన్న వారు ఇలాంటి పెళ్లిళ్లు చేసుకుంటున్న విషయం తెల్సిందే.ట్రెండ్‌ను ఫాలో అయ్యే కార్తికేయ ఈ పెళ్లితో టాలీవుడ్ సెలబ్రెటీలకు దారి చూపించిన వాడు అవుతున్నాడు.ఆమద్య అఖిల్ వివాహం కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ వార్తలు వచ్చాయి.కాని కొన్ని కారణాల వల్ల అఖిల్ వివాహం క్యాన్సిల్ అయ్యింది.