ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13వ తారీకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.ఇంకా 35 రోజులు మాత్రమే సమయం ఉంది.
దీంతో ప్రధాన పార్టీల నాయకులు ప్రచారంలో స్పీడ్ పెంచారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి విజయభేరి( Varahi Vijayabheri Yatra)” పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈసారి పిఠాపురం నియోజకవర్గం( Pithapuram Assembly constituency ) నుండి పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం అందించడం జరిగింది.
దాదాపు 5 కోట్ల రూపాయలు చెక్ పవన్ కళ్యాణ్ కి అందజేశారు.ఇక ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరంజీవి సంచలన పోస్ట్ పెట్టారు.
“అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తాం అంటారు.అధికారం లేకపోయినా, తన సంపాదన ని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )వినియోగించటం నాకు సంతోషాన్ని కలిగించిన విషయం.తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేన కి విరాళాన్ని అందించాను”.అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
గత సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక నుండి పోటీ చేసి ఓటమి చెందారు.దీంతో పిఠాపురంలో ఈసారి ఎలాగైనా గెలవాలని గట్టి పట్టుదల మీద ఉన్నారు.
ఆల్రెడీ పిఠాపురంలో సొంత నివాసం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.అక్కడ నుండే ఎన్నికల పనులు పవన్ పర్యవేక్షిస్తున్నారు.