ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీదే విజయమని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు అన్నారు.వైసీపీ ప్రభుత్వ విధానంతో అన్ని వర్గాలు విసుగు చెందాయని తెలిపారు.
అభివృద్ధి పేరుతో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేస్తున్నారని, ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు.
హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా మార్పు లేదని తెలిపారు.బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని అమలు చేస్తూ భయపెడుతున్నారని మండిపడ్డారు.
ఎక్కడ ఏదీ దొరికితే దాన్ని మింగేస్తున్నారని ఎద్దేవా చేశారు.