షారుఖ్ ఖాన్‌కు బిగ్ రిలీఫ్.. ఆర్యన్ కోసం మాస్టర్ ప్లాన్? 

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టై గత కొద్ది రోజుల నుంచి ఆర్థర్ రోడ్‌లోని జైలులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఉంటున్న సంగతి తెలిసిందే.ఆర్యన్‌ను బెయిల్ మీద బయటకు తీసుకురావడం కోసం ప్రయత్నించినప్పటికీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు.

 Aryan Khan Career Master Plan By The Sharukh Khan Details, Aryan Khan, Sharukh K-TeluguStop.com

కాగా, తాజాగా షారుఖ్ ఖాన్‌కు బిగ్ రిలీప్ లభించింది.ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆర్యన్ బయటకు వచ్చాడు.

కోర్టు నుంచి ఆర్డర్స్ రాగానే ఆర్యన్ ఖాన్ విడుదలయ్యాడు.దాదాపు నెల రోజుల నుంచి కొడుకును జైలు నుంచి విడుదల చేయించేందుకుగాను షారుఖ్ ప్రయత్నించగా, ఎట్టకేలకు ఆర్యన్ బయటకు వచ్చేశాడు.

జైలు నుంచి ఆర్యన్ విడుదల తర్వాత షారుఖ్ ఫ్యామిలీ మెంబర్స్ హ్యాపీగా ఫీలయ్యారు.ఇకపోతే ఆర్యన్ కోసం షారుఖ్, గౌరీ ఖాన్ రకరకాల ప్లాన్స్ వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఆర్యన్ ఖాన్‌ను ఎట్టి పరిస్థితుల్లో బయటకు పంపొద్దని, రెండు నుంచి మూడు నెలల పాటు ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.లేట్ నైట్ పార్టీస్‌కు ఆర్యన్‌ను అస్సలు అనుమతించొద్దని అనుకున్నట్లు సమాచారం.

రిఫ్రెష్‌మెంట్ కోసం ఆర్యన్‌ను అవసరమైతే కొద్ది రోజుల పాటు విదేశాలకు తీసుకెళ్లాలని షారుఖ్, గౌరీ ఖాన్ అనుకున్నారట.

Telugu Advocatemukul, Aryan Khan, Bollywood, Gowry Khan, Sharukh Khan, Sharukhkh

ఇందుకు అవసరమైతే కోర్టు అనుమతి తీసుకోవాలని కూడా ప్లాన్ చేసుకన్నట్టు వినికిడి.ఈ నెల రెండో తేదీన ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు.ఆ తర్వాత ఎన్‌సిబి ఆర్యన్‌ను కస్టడీలోకి తీసుకుంది.

ఇకపోతే బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండేను కూడా ఎన్‌సిబి అధికారులు విచారించారు.ఈ నెల నాల్గో తేదీ నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు.

విచారణ సందర్భంగా కోర్టు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తు వచ్చారు.

Telugu Advocatemukul, Aryan Khan, Bollywood, Gowry Khan, Sharukh Khan, Sharukhkh

ఈ నెల 20 తేదీన తీర్పు రిజర్వ్ కాగా, ఆర్యన్ తరఫున లాయర్స్ బాంబే హై కోర్టును ఆశ్రయించారు.ఇకపోతే ఈ నెల 25న ఆర్యన్ తరఫున లాయర్‌గా భారత మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ రంగంలోకి దిగారు.ఈ క్రమంలోనే మూడు రోజుల పాటు సుదీర్ఘ వాదనలుజరగగా, బెయిల్ ఇవ్వాల్సిందేనని ముకుల్ రోహత్గీ పట్టుబట్టారు.

ఎట్టకేలకు ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికీ బెయిల్ ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube