డ్రాయింగ్ చూసి మొక్కలు నాటుతున్న ప్రజలు... దాని ప్రత్యేకత ఇదే!

ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్( Global Warming ) గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎందుకంటే దాని పర్యవసానం నేటి మానవుడు అనుభవిస్తున్నాడు.

 Artist Creating Beautful Images On Trees Trunks To Save Trees Details, Drawing,-TeluguStop.com

అయినా మారడం లేదు సరికదా చెట్లను నాటాల్సింది పోయి ఇంకా అడవులను నరికేస్తున్నారు.అందుకే ధరణిపై వేడిమి అంతకంతకూ ఎక్కువైపోతోంది.

ఇక వాతావరణ కాలుష్యం ( Pollution ) సంగతి సరే సరి.ఈ క్రమంలోనే పర్యావరణం కోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు కొత్త పద్ధతుల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.అవును, ఒక వ్యక్తి చెట్ల సంరక్షణ కోసం కొత్త మార్గంలో ప్రజలకు సందేశం ఇవ్వడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

చెట్లపై త్రీడీ చిత్రాలను( 3D Images ) రూపొందించి తద్వారా చెట్లను ఎవరూ నరకకూడదు అనే సందేశాన్ని పంపుతున్నాడు.వాతావరణంలో చాలా చెట్లు పెరుగుతాయి.అదే చెట్లు ఇప్పుడు కళాకారులకు కాన్వాస్‌గా మారాయి.

హబ్రాలోని బనిపూర్ ప్రాంతానికి చెందిన ఆర్టిస్ట్ సంజయ్ సర్కార్( Artist sanjay sarkar ) ఈ చెట్లకు భిన్నమైన రూపాన్ని అందివ్వడమే కాకుండా దేశ ప్రజలను ఎడ్యుకేట్ చేసే పనిలో పడ్డాడు.చుట్టుపక్కల చెట్లు నాశనమవుతున్న వేళ, చెట్లను రక్షించాలనే సందేశంతో పాటు చెట్లపై వివిధ పర్యావరణ సృజనాత్మక దృశ్యాలను చిత్రించడం ఇపుడు జనాలకు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది.

ఈ చెట్లు బనీపూర్ ప్రాంతంలోని బీఆర్ అంబేద్కర్ స్పోర్ట్స్ స్కూల్ ముందు ప్రత్యక్షమౌతున్నాయి.దేవతలు, పిల్లులు, జంతువులు, పక్షులు… ఇలా ఒక్కటేమిటి చాలా రకాల చిత్రాలను ఇక్కడ రూపొందించారు.దూరం నుండి చూస్తే కొన్ని జంతువులు, పక్షులు చెట్టుపై కూర్చున్నట్లు కనిపిస్తాయి.కాగా ప్రస్తుతం ఈ చెట్లపై చిత్రీకరించిన ఈ 3డి చిత్రాల్ని చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు.

ఒక కళాకారుడి కళను చూసి సోషల్ మీడియా యూజర్లు మంచి రియాక్షన్స్ ఇస్తున్నారు.తాము తప్పకుండా ఒక్క మొక్కనైనా నాటుతామని ఈ సందర్భంగా ప్రామిస్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube