మామూలుగా టాలెంట్ అనేది అందరిలో ఒకలాగా ఉండదు.ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా టాలెంట్ ఉంటుంది.
అయితే కొందరికి కొత్తగా ఏమైనా నేర్చుకోవాలని చాలా ఉంటుంది.ఇక దానికోసం వారి ప్రయత్నాలు మామూలుగా ఉండవు.
కొన్నిసార్లు వారి ప్రయత్నాలు ట్రోల్స్ కి కూడా గురవుతూ ఉంటాయి.ఇప్పుడు అటువంటిదే బుల్లితెర ఆర్టిస్ట్ అరియానా( Ariyana ) ఎదుర్కొంటుంది.
తాజాగా తను ఒక పోస్ట్ షేర్ చేసుకోగా నెటిజన్స్ బాగా ట్రోల్ చేస్తున్నారు.మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
అరియానా మొదట్లో యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా చేస్తూ ఉండేది.అయితే ఓసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తో( Ram Gopal Varma ) బోల్డ్ ఇంటర్వ్యూ చేయడంతో అప్పటి నుండి అందరి దృష్టిలో పడింది.
దీంతో ఆమెకు వెంటనే బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో ( Bigg Boss ) అవకాశం వచ్చింది.ఇక ఆ షోలో బోల్ట్ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి బాగా రచ్చ చేసింది.
మరో కంటెస్టెంట్ సోహెల్ తో బాగా రచ్చ రచ్చ చేసింది.ఆ తర్వాత షో నుండి బయటకు వచ్చాక తన పరిచయాన్ని పూర్తిగా పెంచేసుకుంది.ఇక యూట్యూబ్లలో పలు షార్ట్ ఫిలిమ్స్ లలో కూడా చేసింది.దీంతో అక్కడ కూడా మంచి గుర్తింపు అందుకుంది.
ఆ తర్వాత బిగ్ బాస్ బజ్ లో కూడా యాంకర్ గా చేసింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా కనిపిస్తుంది.
ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తుంది.తనకు సంబంధించిన డాన్స్ వీడియోలను, ఫోటోలను బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ఈ మధ్య మాత్రం ఈమె చాలా బోల్డ్ గా కనిపిస్తుంది.హీరోయిన్ లు చేసే ఎక్స్పోజ్ లు ఈమె కూడా చేస్తూ అందరి దృష్టిలో పడుతుంది.
బాగా ఫోటోషూట్లు చేయించుకుంటూ వాటిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది.ఫ్రెండ్స్ అంటూ వారితో బాగా చిల్ అవుతూ కనిపిస్తుంది.ఇక ఆ మధ్యనే బుల్లితెరపై బీబీ డాన్స్ జోడిలో డాన్సర్ గా అడుగు పెట్టింది.ఇక ఈమెకు నిజానికి డాన్స్ అనేది రాదు.కానీ ఆ షోలో తన డాన్స్ టాలెంట్ ను బయటపెట్టేసింది.అయినప్పటికి కూడా ఈమె డాన్స్ చూసి జనాలు ట్రోల్ చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా ఈమె తన సోషల్ మీడియాలో ఏదైనా రీల్ కానీ, డాన్స్ వీడియో కానీ షేర్ చేస్తే మాత్రం నెటిజన్స్ ఓ రేంజ్ లో ఏకీపారేస్తూ ఉంటారు.పైగా ఈమె అందాల ప్రదర్శన ఎక్కువగా చేస్తూ దాచేయాల్సిన అందాలు కూడా బయట పెట్టడం వల్ల బాగా కామెంట్లు ఎదుర్కొంటుంది.అయితే తాజాగా ఓ సినిమాలోని డైలాగును రీల్ రూపంలో చేయగా దానిని తన ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
ఇక ఆ వీడియో చూసి మళ్లీ జనాలు ఆమెపై కామెంట్లు చేయటం మొదలుపెట్టారు.
డాన్స్ అనుకున్న యాక్టింగ్ కూడా రాదు అన్నమాట అని ఒకరు కామెంట్ చేయగా.తు నా ఫేవరెట్ సినిమాని చెడగొట్టావ్ ఆంటీ అంటూ మరొకరు ట్రోల్ చేశారు.
కొంతమంది నీ ఓవరాక్షన్ తగ్గించుకో అంటూ కామెంట్ల ద్వారా ఆమెను భయపెడుతున్నారు.