బడ్జెట్ పై వైసీపీకి అవగాహన కూడా లేదని టీడీపీ యనమల విమర్శలు గుప్పించారు.కేంద్ర బడ్జెట్ బాగుందని మంత్రి బుగ్గన ప్రకటిస్తే నిరాశాజనకంగా ఉందని ఎంపీ మిథున్ రెడ్డి అంటున్నారని తెలిపారు.
ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నా వైసీపీ ఎంపీలు నోరు మెదపడం లేదని విమర్శించారు.వృద్ధి రేటు, సంక్షేమంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఏపీ జీఎస్డీపీ వృద్దిరేటును మైనస్ నాలుగుకు దిగజార్చారని ఆరోపించారు.అంతేకాకుండా అన్ని రంగాలను తిరోగమనంలోకి నెట్టారని తెలిపారు.
రెండంకెల వృద్దిని దిగజార్చడమేనా జగన్ చెప్పే వృద్ది అని ప్రశ్నించారు.