ఎస్‌బీఐ కస్టమర్లు ఈ విషయం తెలిసిందా? ఈ 2 స్కీమ్స్ వచ్చే నెల నుంచి మాయం కానున్నాయి!

అవును, మీరు విన్నది నిజమే.ఎస్‌బీఐ 2 రకాల స్పెషల్ స్కీమ్స్ ఇకపై మాయం కానున్నాయి.

 Are Sbi Customers Aware Of This These 2 Schemes Will Expire From Next Month, Sb-TeluguStop.com

ఈ నెల చివరి వరకే ఈ పథకాలు అందుబాటులో ఉంటాయి.అందువల్ల ఈ స్కీమ్‌లో చేరాలని భావించే వారు ఈ విషయాన్ని గుర్తెరిగి ఈలోపే చేరితే బావుంటుంది.

దేశీయ అతిపెద్ద బ్యాంక్‌ ఐనటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఫిక్స్‌డ్ డిపాజిట్ సర్వీసులు వున్న సంగతి అందరికీ తెలిసినదే.ఎస్‌బీఐ బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఈ ప్రత్యేకమైన స్కీమ్స్ ఎస్‌బీఐ ఉయ్ కేర్ ఎఫ్‌డీ, ఎస్‌బీఐ అమృత్ కలశ్ డిపాజిట్ వంటి స్పెషల్ స్కీమ్స్ ఉన్నాయి.

అంటే ఇవి రెగ్యులర్ ఎఫ్‌డీలకు అదనం అని చెప్పుకోవాలి.

Telugu Schemes, Aware, Expire, Sbi-Latest News - Telugu

వీటిల్లో చేరడం వల్ల కస్టమర్లు అధిర రాబడి పొందగలుగుతారు.అయితే ఈ స్కీమ్ పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటాయి.స్టేట్ బ్యాంక్ అందిస్తున్న ఈ రెండు స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ కేవలం మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి.

అందువల్ల ఈ స్కీమ్స్ బెనిఫిట్స్‌ను ఇప్పుడే పొందండి.లేదంటే వచ్చే నెల నుంచి ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే కుదరదు.ఇక అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్ విషయానికి వస్తే.దీని టెన్యూర్ 400 రోజులు ఉంటుంది.ఈ స్కీమ్‌లో చేరడం వల్ల 7.1 శాతం వడ్డీ పొందొచ్చు.రెగ్యులర్ కస్టమర్లకు ఇది వర్తిస్తుంది.అదే సీనియర్ సిటిజన్స్ అయితే 7.6 శాతం వరకు వడ్డీని సొంతం చేసుకోవచ్చు.

Telugu Schemes, Aware, Expire, Sbi-Latest News - Telugu

అలాగే ఎస్‌బీఐ సీనియర్ సిటిజన్స్ కోసం ఉయ్ కేర్ పేరుతో స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌ను ఒకదానిని ప్రవేశపెట్టింది.ఇందులో చేరితే అధిక వడ్డీని రాబట్టొచ్చు.ఈ స్కీమ్‌పై లోన్ ఫెసిలిటీ కూడా ఉంది.

బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరొచ్చు.వడ్డీ మొత్తాన్ని నెల, 3 నెలలకు ఒకసారి పొందొచ్చు.

ఐదేళ్ల లేదా పదేళ్ల టెన్యూర్‌తో మీరు ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో చేరే అవకాశం కలదు.ఈ స్కీమ్‌పై వడ్డీ రేటు విషయానికి వస్తే.

రెగ్యులర్ కస్టమర్ల కన్నా ఒక శాతం అధిక వడ్డీ పొందొచ్చు.అంటే స్టేట్ బ్యాంక్ సాధారణంగా రెగ్యులర్ కస్టమర్ల కన్నా సీనియర్ సిటిజన్స్‌కు ఎఫ్‌డీలపై 50 బేసిస్ పాయింట్లు ఎక్కువగా వడ్డీని అందిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube