కళాభినేత్రి వాణిశ్రీ, మహానటి సావిత్రి( Vanishree, Mahanati Savitri ) మధ్య ఒకటి రెండు సార్లు ఘర్షణపూరిత వాతావరణం జరిగింది.ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో త్వరగానే చిన్న వార్త కూడా వైరల్ అయిపోతుంది కానీ నాటి రోజుల్లో అలా కాదు.
ఏదైనా జరిగితే వారు చెప్తే తప్ప బయట ప్రపంచానికి తెలిసేది కాదు.ఇక సావిత్రి సైతం వాణిశ్రీకి వార్నింగ్ ఇచ్చిన విషయం తనకు తానుగా వాణిశ్రీ మీడియా కు చెప్పిన విషయమే.
అసలు వార్తల్లోకి వెళ్తే, సావిత్రి ని ఆదర్శంగా తీసుకొని వాణిశ్రీ సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది.ఆమె నటించే విధానం, డైలాగ్స్ చెప్పే పద్ధతి అన్ని కూడా వాణిశ్రీ ఆలా చూసి ఆమె కూడా తనలాగా చేయాలనీ ప్రయతించేది.

చెలికత్తె వేషం నుంచి కమెడియన్ గా ఆ తర్వాత హీరోయిన్ గా మారింది వాణిశ్రీ.అయితే ఆమె హీరోయిన్( Heroine ) గా ఇదిగాక సావిత్రి ని ఆదర్శంగా తీసుకొని ఆమెలాగానే నటించేది.నడిచిన, నిలబడ్డ, నవ్వినా చివరికి కట్టు, బొట్టు విషయంలో కూడా వాణిశ్రీ సావిత్రి ని ఫాలో అవ్వడం మొదలు పెట్టింది.ఇది సావిత్రి కూడా గమనిస్తూ వచ్చారు.
నాది ఆడజన్మే సినిమా టైం లో సావిత్రి వాణిశ్రీని కలిశారు.అప్పుడు సావిత్రి వాణిశ్రీని ఇలా అడిగారు, నాలాగా ఎందుకు చేస్తున్నావ్, నాలాగా చేయడానికి నేనే ఉండగా మరొక నటి అవసరం ఏముంది.
మరో సావిత్రి కి ఇక్కడ స్థానం లేదు.నీలాగా నువ్వు చేయగలిగితేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది.
అప్పుడే నీలోని అసలు నటి బయటకు వస్తుంది అంటూ క్లాస్ పీకారట.

పైగా ఆ టైం లో పీలగా, సన్నగా ఉన్న వాణిశ్రీని చూసి కాస్త తిను లేదంటే పేషేంట్ సీన్స్ కి పనికి వాస్తవ అని కోప్పడ్డారట.అప్పటి నుంచి వాణిశ్రీ పూర్తిగా సావిత్రిని తన నుంచి దూరం చేసుకొని ఆమెలోని అసలు నటిని ఇండస్ట్రీ కి చూపించడం మొదలు పెట్టింది.ఆలా ఆమె ఏకంగా కళాభినేత్రిగా ఎదిగింది.
ఆమె కట్టే చీరలు, పెట్టె బొట్లు అన్ని కూడా ఎంతో ఫ్యాషన్ గా ఉండేవి.అప్పట్లో వాణిశ్రీ చీరలు అంటే ఎంతో డిమాండ్ ఉండేది.
చివరికి ఆమె పెట్టుకునే కొప్పు కూడా చాల మంది కాపీ కొట్టేవారు.ఆలా మొత్తానికి సావిత్రి వార్నింగ్ తో వాణిశ్రీ తన నటనను మెరుగు పరుచుకుంది.