విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో పోలీసులకు పురోగతి లభించింది.ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే టార్గెట్ గా ఈ ముఠా కిడ్నీ రాకెట్ ను నడిపిందని వెల్లడించారు.
విజయవాడలో చోటు చేసుకున్న రెండు కేసులో వీరు నిందితులుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు.ఈ క్రమంలోనే ఒక్కో కేసులో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు డీల్ కుదుర్చుకుని కిడ్నీ విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు.