ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం మొదటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల రూప రేఖలు మార్చి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానంతో పాటు ఆన్ లైన్ స్టడీ మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది.
ఇదే సమయంలో పిల్లలకు.తల్లిదండ్రులకూ ప్రోత్సహించడం కోసం పలు రకాల పథకాలు అమలు చేస్తూ ఉంది.
అమ్మ ఒడి ఇంకా జగనన్న గోరుముద్దవంటి పథకాల ద్వారా పిల్లలకు అనేక మంచి పనులు చేస్తూ ఉంది.
జగనన్న గోరుముద్ద పథకం ద్వారా పిల్లలకు మంచి పోషక ఆహారం లభించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.ఈ క్రమంలో తాజాగా జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకంలో.అదనంగా మరో న్యూట్రియెంట్ రాగిజావ ఏపీ ప్రభుత్వం చేర్చింది.
పిల్లలకు ఐరన్ మరియు కాలుష్యం లోపాలు లేకుండా నివారించడానికి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ సత్య సాయి చారిటబుల్ ట్రస్ట్ భాగస్వామ్యం కానుంది.