ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.జనసేనను బయట నుంచి ఎవరూ ప్రభావితం చేయకుండా చూడాలని తెలిపారు.
జనసేనను అధికారంలోకి తీసుకొచ్చే అంశం పవన్ కల్యాణ్ కే వదిలేయాలని కన్నా పేర్కొన్నారు.ఎంపీ జీవీఎల్ ఏం సాధించారని కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారని ప్రశ్నించారు.
జీవీఎల్ పార్లమెంట్ లో అడిగిన సమాచారం గూగుల్ లో కొట్టినా వస్తుందని విమర్శించారు.వైఎస్ఆర్ హయాంలో కాపు రిజర్వేషన్ అంశం తెరపైకి వచ్చిందన్న కన్నా లక్ష్మీనారాయణ… చంద్రబాబు హయాంలో ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు వచ్చేలా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని చంద్రబాబు పూర్తి చేశారని కన్నా వెల్లడించారు.