9వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి శోభా శెట్టి తో పాటుగా ఎలిమినేట్ అవ్వబోతున్న మరో టాప్ కంటెస్టెంట్!

ఈ వారం బిగ్ బాస్ హౌస్( Bigg Boss House ) ఎంత హీట్ వాతావరణం నడుమ కొనసాగిందో మనమంతా చూస్తూనే ఉన్నాం .ముఖ్యంగా నామినేషన్స్ పర్వం అయితే హౌస్ ని ఉడికించేసింది.

 Another Top Contestant Who Is Going To Be Eliminated Along With Shobha Shetty Fr-TeluguStop.com

ఈ నామినేషన్స్ లో అమర్ దీప్( Amar Deep ) బాగా హైలైట్ అయ్యి తన గ్రాఫ్ ని పెంచుకున్నాడు.ఈసారి నామినేషన్స్ లోకి శివాజీ ,పల్లవి ప్రశాంత్, గౌతమ్ మరియు అశ్విని తప్ప హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు.

వీరిలో ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ అయిపోతుందని అందరికీ అర్థం అయిపోయింది.ఈ విషయం ఆమెకి కూడా తెలుసు కాబట్టే ఈ వీక్ మొత్తం బాగా డల్ అయిపోయింది.

ఇంతకు ముందు ఉన్నంత పొగరు, యాటిట్యూడ్ ఇప్పుడు అసలు ఆమెలో కనిపించడం లేదు.అసలు మనం 8 వారాలు చూసిన శోభా శెట్టి నేనా ఇప్పుడు కూడా చూస్తుంది?, ఇలా మొదటి నుండి ఉండుంటే నేడు ఇలా డేంజర్ జోన్ లో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Amar Deep, Bigg Boss, Shobha Shetty, Tasty Teja, Ulta Palta-Movie

ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్ మొత్తం ‘ఉల్టా పల్టా’ ( Ulta Palta )అనే విషయం మన అందరికీ తెలుసు.మొదటి నుండి హౌస్ మేట్స్ కోరుకున్నట్టు, ప్రేక్షకులు ఊహించినట్టు ఒక్కటి కూడా లోపల జరగడం లేదు.ఎవ్వరూ ఊహించని సంఘటనలే ఇప్పటి వరకు చోటు చేసుకున్నాయి.అలా ఈ వారం కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు.ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభమై 8 వారాలు పూర్తి అయ్యింది.కానీ హౌస్ లో ఇంకా 11 మంది ఉన్నారు.

కచ్చితంగా ఎదో ఒక వారం డబుల్ ఎలిమినేషన్ జరగాల్సిందే.అది ఈ వారమే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా లో ఉన్న ఓటింగ్ ప్రకారం అయితే శోభా శెట్టి తో పాటుగా టేస్టీ తేజా( Tasty Teja ) కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు.వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Telugu Amar Deep, Bigg Boss, Shobha Shetty, Tasty Teja, Ulta Palta-Movie

ఈసారి హౌస్ లో లవ్ ట్రాక్స్ పెద్దగా లేకపోయినా, ఉన్నవారిలో తేజా మరియు శోభా శెట్టి మధ్య చిన్న లవ్ ట్రాక్ నడుస్తూ వస్తుంది.వీళ్లిద్దరి మధ్య జోకులు, జరిగిన ఎమోషనల్ బాండింగ్ ఇలా ప్రతీ ఒక్కటి చూసిన ఆడియన్స్ కి చాలా బాగా అనిపించింది.ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ నడుస్తుంది అనే విషయం అందరికీ అర్థం అయ్యింది.అలాంటి జంట హౌస్ నుండి ఒకేసారి ఎలిమినేట్ అయితే ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

అయితే తేజ హౌస్ లో మంచి ఎంటర్టైన్మెంట్ పంచే వ్యక్తి కాబట్టి అతను హౌస్ నుండి ఎలిమినేట్ అయితే టీఆర్ఫీ రేటింగ్స్ పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.కాబట్టి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ని పెట్టకపోవచ్చు అని మరికొంతమంది అనుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube