ఏపీలో మరో పథకానికి శ్రీకారం.. నేడు జగనన్న విదేశీ విద్యాదీవెన అమలు

ఏపీ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టనుంది.పేద విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా టాప్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సాయం అందించనుంది.

 Another Scheme Has Been Launched In Ap-TeluguStop.com

ఈ మేరకు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు.ఇందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వందల విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందిన రెండువందల పదమూడు మందికి మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో పాటు అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు సాయం అందించేందుకు ఈ పథకాన్ని తీసుకువచ్చారు.ఇందులో భాగంగా టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు, మిగిలిన వారికి రూ.కోటి వరకు వంద శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం అందించనుంది.వంద నుంచి రెండు వందల క్యూఎస్ ర్యాకింగ్ యూనివర్సిటీల్లో సీటు పొందిన వారికి రూ.75 లక్షల వరకు రీయింబర్స్ మెంట్ అందించనుంది.మిగిలిన విద్యార్థులకు రూ.50 లక్షలు అందించడంతో పాటు విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి విమాన, వీసా ఛార్జీలను సైతం ప్రభుత్వమే భరించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube