ఇకనుండి అక్కడ ఒకే గదిలో సినిమా షూట్‌ మొత్తం చేయనున్నారు!

సినిమా అనేది చాలా పెద్ద వ్యవహారం.24 రకాల క్రాఫ్టులు.ఏ ఒక్క క్రాఫ్ట్ గురించి అవగాహన లేకపోయినా, అంతేసంగతి.ఓ రకంగా చెప్పాలంటే కత్తి మీద సాము లాంటిది సినిమా మేకింగ్ ప్రక్రియ.సీన్స్ కి తగ్గట్టు లొకేషన్లు వెతుక్కోవాలి.అవసరమైనపుడు దేశాలు దాటి వెళ్లి షూటింగ్‌ చేయాలి.

 Annapurna Studios To Use Virtual Production Technology For Shooting Movies Detai-TeluguStop.com

అందువలన వీసా, విమాన టికెట్‌, అకామిడేషన్‌, షూటింగ్‌ సామగ్రి.ఇలా నిర్మాతకు బండెడు ఖర్చు.

తీరా లొకేషన్‌కు వెళ్లాక వాతావరణం బాగోలేకపోతే, ఆ రోజు షూటింగ్‌ బంద్‌.ఖర్చు పెట్డిన డబ్బు గంగలో పోసిన పన్నీరు అయిపోతుంది.

అందుకే కొందరు మహానుభావులు ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకొని, ప్రత్యామ్నాయ మార్గాలను కనిపెడతారు.ఈ క్రమంలో వచ్చిన అత్యాధునిక సాంకేతికతే.వర్చువల్‌ ప్రొడక్షన్‌ టెక్నాలజీ. దీని సహాయంతో ఒక చిన్న గదిలో, కావాల్సిన విధంగా మొత్తం సినిమాను చిత్రీకరించొచ్చు.

ఈ సాంకేతికతను దేశంలోనే తొలిసారి అన్నపూర్ణ స్టూడియోస్‌ అందుబాటులోకి తీసుకురానుంది.ఎడారిలో సీన్‌ చేయాలంటే అక్కడికి వెళ్లాల్సిన పని లేదు.

ఒక పెద్ద తెరపై ఎడారి బ్యాగ్రౌండ్‌ కనిపించేలా చేసి.దాని ముందు నిల్చొని నటిస్తే సరిపోతుంది.

సినిమా చూసేటప్పుడు నిజంగానే ఎడారిలో తీసినట్టే ఉంటుంది ఆ సీన్‌.

Telugu Cinima, Tollywood, Latest, Virtual-Latest News - Telugu

ఇప్పటికే విదేశాల్లో అందుబాటులోకి వచ్చిన ఈ టెక్నాలజీ భారతీయ సినీ చిత్ర పరిశ్రమలోకి కూడా అడుగుపెట్టబోతున్నది.లొకేషన్‌, స్పేస్‌, బడ్జెట్‌ పరిమితులకు లోబడి రాసుకొన్న కథను సినిమాగా, వెబ్‌ సిరీస్‌గా తీర్చిదిద్దేందుకు ఈ వేదిక చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.దీనికోసం ఒక గదిలో భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తారు.

దానిపై అవసరమైన లొకేషన్లు, వస్తువులు కనిపించేలా చేస్తారు.అక్కడి వేదికపై దర్శకులు చెప్పినట్టు నటీనటులు నటిస్తే చాలు.

ఎలాంటి లొకేషన్‌ అయినా సరే అక్కడ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube