తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ( Anil Ravipudi ) ఒకరు.ఇప్పటివరకు ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి ఏడు సినిమాలు చేశారు అయితే ఈ ఏడు సినిమాల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
అపజయం ఎరుగని దర్శకులుగా రాజమౌళి ( Rajamouli ) తర్వాత అనిల్ రావిపూడి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నారు.బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్నటువంటి అనిల్ రావిపూడి త్వరలోనే రాజకీయాలలోకి రాబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.ఇందులో భాగంగానే ఈయన కూడా అచ్చం రాజకీయ నాయకుడి వేషదారణలో ఒక వీడియోని షేర్ చేశారు.ఇందులో భాగంగా అనిల్ మాటడుతూ నేను సినిమాలను చేశాను మీరు హిట్ ఇచ్చారు.
నేను ఎంటర్టైన్ చేశాను మీరు ఎంటర్టైన్ అయ్యారు.ఇలా థియేటర్లో గెలిచిన నేను పార్లమెంట్ అసెంబ్లీలో గెలవాలనుకుంటున్నారు మీరు అనుకుంటే నన్ను అక్కడికి కూడా పంపిస్తారు.
ఇప్పటివరకు నేను బాక్సాఫీస్ వద్ద గెలుపు చూశాను.అయితే బ్యాలెట్ బాక్స్ వద్ద కూడా గెలుపు చూడాలనుకుంటున్నాను త్వరలోనే పార్టీ పెట్టబోతున్నానని అన్ని విషయాలు ప్రకటించబోతున్నాను అంటూ ఈయన ఒక వీడియోని షేర్ చేశారు.అయితే అనిల్ రావిపూడి షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారడంతో ఏంటి ఈయన నిజంగానే రాజకీయాలలోకి రాబోతున్నారా డైరెక్షన్ కి గుడ్ బై చెప్పబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం అవుతున్నాయి కానీ ఈయన ఒక షో కోసమే ఇలా గెటప్ వేసారని తెలుస్తోంది.ఇది వరకు ఆహా( Aaha ) లో ప్రసారమైనటువంటి ఒక కార్యక్రమానికి అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించారు.
అయితే త్వరలోనే ఆహా మరొక షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అందులో భాగంగానే అనిల్ రావిపూడి ఇలా ఒక వీడియో షేర్ చేశారని అర్థమవుతుంది.త్వరలోనే ఈ షో కి సంబంధించి పూర్తి వివరాలు రానున్నాయి.