ఆ విషయం లో వెనక పడ్డ బాలయ్య 'భగవంత్ కేసరి'

నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) అఖండ మరియు వీర సింహా రెడ్డి సినిమాల తర్వాత పూర్తి వైవిధ్యభరిత సినిమా భగవంత్ కేసరితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అనిల్ రావిపూడి ఇప్పటి వరకు కమర్షియల్‌ ఎంటర్టైనర్ సినిమాలను రూపొందించాడు.

 Anil Ravipudi And Balakrishna Bhagavanth Kesari Movie Trailer Not Yet Release ,-TeluguStop.com

అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా యాక్షన్ ని కూడా జత కలిపి ఒక మంచి సినిమా ను రూపొందించాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.భగవంత్ కేసరి సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది.

దసరా కానుకగా అక్టోబర్‌ 19న భగవంత్‌ కేసరి( Bhagavanth kesari ) సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

Telugu Anil Ravipudi, Balakrishna, Sreeleela, Telugu, Tigernageswara, Tollywood,

అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.దసరా కానుకగా లియో మరియు టైగర్‌ నాగేశ్వరరావు( Tiger Nageswara Rao ) సినిమా కూడా రాబోతున్న విషయం తెల్సిందే.ఈ మూడు సినిమాల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది.

అందుకే ప్రమోషన్ విషయం లో ఒకదాన్ని మించి మరోటి చేయాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.లియో మరియు టైగర్‌ నాగేశ్వరరావు యొక్క ట్రైలర్స్‌ ఇప్పటికే విడుదల అయ్యాయి.

Telugu Anil Ravipudi, Balakrishna, Sreeleela, Telugu, Tigernageswara, Tollywood,

కానీ భగవంత్‌ కేసరి ఆ విషయం లో వెనక పడి ఉన్నాడు.రవితేజ ప్రమోషన్ విషయం లో దూసుకు పోతున్నాడు.యూనిట్‌ సభ్యులతో కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు.మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వబోతున్నాడు.ఇక బాలయ్య రాజకీయాలతో బిజీగా ఉన్నాడు.బావ బాబు అరెస్ట్‌ అవ్వడం తో బాలయ్య ఎక్కువగా రాజమండ్రి లో ఉంటున్నాడు.

దాంతో ట్రైలర్‌ విడుదల ఆలస్యం అయింది.అంతే కాకుండా ప్రమోషన్‌ కార్యక్రమాల విషయం లో కూడా జాప్యం జరుగుతోంది.

బాలయ్య ప్రమోషన్ విషయం లో ఎప్పుడు కూడా ముందు ఉండే వాడు.కానీ ఈసారి మాత్రం కాస్త ఇబ్బందిగా భగవంత్ కేసరి విషయం లో ఉన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ట్రైలర్ విడుదల చేస్తే మిగిలిన ప్రమోషన్ ను ఫ్యాన్స్ చూసుకుంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube