అషు రెడ్డిని ఘోరంగా అవమానించిన యాంకర్ రవి.. నీకు అది కూడా వస్తుందా అంటూ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ  సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకున్న బ్యూటీ అషురెడ్డి.

 Anchor Ravi Satires On Ashu Reddy Anchor Ravi, Ashu Reddy, Social Media, Trolls,-TeluguStop.com

సోషల్ మీడియాలో అషురెడ్డి కి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.అంతే కాకుండా అషు రెడ్డి బుల్లితెర సమంత గా కూడా పేరు తెచ్చుకుంది.

ఆ తర్వాత బిగ్ బాస్ కి ఎంట్రీ ఇచ్చే మరింత పాపులారిటీని సంపాదించు కుంది ఈ బ్యూటీ.ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందాల కనువిందు చేస్తూ ఉంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.

ఇకపోతే అషురెడ్డి ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా తన ఇన్ స్టా లో ఒక ఫోటో షేర్ చేస్తూ వరుడు కావలెను.సిగ్గు వస్తుంది.

ఎందుకో అంటూ కామెంట్ పెట్టింది అషురెడ్డి.ఈ విషయంపై స్పందించిన యాంకర్ రవి నీకు అది కూడా వస్తుందా అంటూ కామెంట్ పెట్టాడు.

దీంతో ఒక్కసారిగా అషురెడ్డి పరువు పోయినంత పని అయ్యింది.ఇకపోతే ఇటీవలె అషురెడ్డి వస్త్రధారణ విషయంలో సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఇలా నిత్యం ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ.అప్పుడప్పుడు నెటిజన్స్ ట్రోలింగ్స్ సైతం గురి అవుతూ ఉంటుంది.

ఇకపోతే అషు రెడ్డి విజయ్ శంకర్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం పోకస్.ఈ సినిమాలో సుహాసిని మణిరత్నం కీలక పాత్రలో నటించ నున్నారు.ఈ సినిమాకు జి.సూర్యతేజ దర్శకత్వం వహించగా, సైరా క్రియేషన్స్ సమర్పణలో రిలాక్స్ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా మార్చి లో విడుదల కానుంది.ఈ సినిమా మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరొక వైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, అదే విధంగా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది అషురెడ్డి.

Anchor Ravi Satires On Ashu Reddy Anchor Ravi

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube