ఇది శ్రీకాంత్ అడ్డాల సినిమా ఆ గొడవల గురించి మాట్లాడను.. అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ ( Anasuya ) అనంతరం వెండితెరపై కూడా సినిమా అవకాశాలను అందుకొని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా నటిగా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె త్వరలోనే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చినటువంటి పెద్ద కాపు ( Peddha Kapu ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

 Aanasuya Once Again React On Vijay Deverakonda Issue, Anasuya, Vijay Devarakonda-TeluguStop.com

ఈ సినిమాలో అనసూయ కీలకపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

Telugu Anasuya, Peddha Kapu, Srikanth Addala, Tollywood-Movie

ఇందులో భాగంగానే తాజాగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొనగా మీడియా ప్రతినిధులు అనసూయను ప్రశ్నిస్తూ విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) ప్రస్తావనను తీసుకువచ్చారు.విజయ్ దేవరకొండతో అనసూయకు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా వీరిద్దరి మధ్య గొడవ జరుగుతున్న నేపథ్యంలో తరచూ ఈ గొడవ గురించి మీడియా ప్రతినిధులు వీరిద్దరిని ప్రశ్నిస్తూనే ఉంటారు.తాజాగా ఈ సినిమా వేడుకలో కూడా అనసూయకు విజయ్ దేవరకొండతో గొడవ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

Telugu Anasuya, Peddha Kapu, Srikanth Addala, Tollywood-Movie

ఈ విధంగా మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో అనసూయ సమాధానం చెబుతూ.ఇది శ్రీకాంత్ అడ్డాల( Srikanth Addala ) గారి సినిమా ఈ సినిమా వేడుకలో తాను ఎలాంటి గొడవలు గురించి మాట్లాడాలని కోరుకోలేదు.ఇదే ప్రశ్న మీరు ఏ సినిమా ఈవెంట్లో అయినా అడగండి చెబుతాను కానీ మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు అంటూ విజయ్ దేవరకొండ ఇష్యూ గురించి అనసూయ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక వీరిద్దరి మధ్య అర్జున్ రెడ్డి( Arjun Reddy ) సమయంలో మొదలైనటువంటి గొడవ ఇప్పటికీ పూర్తి కాలేదని ఇప్పటికీ ఈ గొడవ కొనసాగుతూనే ఉందని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube