అమితాబ్ కూడా గోడలు దూకేవారా.. కాలేజీ రోజులను గుర్తు చేసుకున్న బిగ్ బీ!

బాలీవుడ్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో  నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఒకరు.ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.

 Amitabh Bachchan Remembering His College Days Details, Amithabh Bachchan, Colleg-TeluguStop.com

ఇలా నటుడిగా మెప్పించినటువంటి అమితాబ్ ఇప్పుడు 8 పదుల వయసులోకి అడుగుపెట్టిన కూడా చాలా చలాకీగా ఉంటూ ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.ఇలా ఈయన పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా మరోవైపు కౌన్ బనేగా కరోడ్ పతి(Kaun Banega Crorepati) కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇటీవల ఈ కార్యక్రమం 15వ సీజన్ ఎపిసోడ్ ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకుంది.ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా తన కాలేజీలో చదివినటువంటి ఒక కంటెస్టెంట్ పాల్గొన్నారు.దీంతో అమితాబ్ కూడా తన కాలేజీ రోజులను( College Days ) గుర్తు చేసుకున్నారు.అమితాబ్ కిరోరీ మల్ కాలేజీలోనే చదువుకున్నానని తెలిపారు.అయితే అప్పట్లో తాను హాస్టల్ లో( Hostel ) ఉండి చదువుకునేవాడిని అంటూ అమితాబ్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

ఇక ఈ హాస్టల్లో మా గది ఒక మూలకు ఉండేది ఆ గదిలో నుంచి చూస్తే బయట కాంపౌండ్ బాగా కనిపించేదని దాంతో సెక్యూరిటీ కి తెలియకుండా మేము ఆ గోడ దూకి సినిమాలకు వెళ్లి వచ్చి తిరిగి ఆ గోడ దూకి హాస్టల్ కి వెళ్లే వాళ్ళం అంటూ ఈ సందర్భంగా అమితాబ్ అప్పట్లో చేసినటువంటి అల్లరి పనులకు సంబంధించినటువంటి విషయాలను గుర్తు చేసుకున్నారు.అయితే నేను డిగ్రీ చదివిన ఆ డిగ్రీ సర్టిఫికెట్ వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు అంటూ ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube