అమెరికా కోర్టు ఒబామా ప్రవేసపెట్టిన ఆరోగ్య సంరక్షణ చట్టం ఒబామా కేర్ పై సంచలన తీర్పు ఇచ్చింది.ఒబామాకేర్ రాజ్యంగ విరుద్దమని తెలిపింది.
ఒబామాకేర్ కింద అమెరికా పౌరులు అందరూ తప్పనిసరిగా ఆరోగ్య భీమా పొందాలని లేదా ప్రభుత్వానికి జరిమానా కట్టాలని ఆ చట్టం ఉద్దేశ్యం అయితే ఇప్పుడు దీన్ని కోర్టు రద్దు చేయమని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రిపబ్లికన్స్.
అయితే కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే ఒబామాకేర్‌ను రద్దు చేస్తామని గతంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్ హామీ ఇచ్చాడు.అయితే ఈ చట్టానికి వ్యతిరేకంగా ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు గవర్నర్లు, ప్రభుత్వ న్యాయవాదులు వేసిన కేసులో కోర్టు ఈ తీర్పుని ఇచ్చింది.
అయితే ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తామని.ఒబామాకేర్ ప్రజలకి మంచి చేస్తుందని త్వరలో ఈ తీర్పుపై అప్పీలు చేస్తామని డెమోక్రాట్లు తెలిపారు.మొత్తానికి ట్రంప్ అనుకున్నట్టుగానే ఒబామా ప్రవేసపెట్టిన ఒబామాకేర్ చట్టంపై రాజకీయం చేశాడు అంటున్నారు అమెరికా ప్రజలు.