అగ్రరాజ్యం అమెరికాలో చైనాకు చెందిన ఓ స్పై బెలూన్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో చైనా బెలూన్ ను అమెరికా కూల్చివేసింది.
కరోలినా తీరంలో చైనా గూఢచారి బెలూన్ ను ట్రాక్ చేసిన అమెరికా రక్షణశాఖ కూల్చివేసింది.ఎఫ్ -22 జెట్ ఫైటర్ నుంచి ఓ క్షిపణిని ప్రయోగించి గాలిలోనే బెలూన్ ను పేల్చివేశారు అధికారులు.
ఈ నేపథ్యంలో కూల్చివేత టైమ్ లో మూడు విమానాశ్రయాలతో పాటు గగనతలాన్ని మూసివేశారు.కూల్చివేయడంతో చైనా బెలూన్ అట్లాంటిక్ సముద్రంలో కూలిపోయింది.
దీంతో బెలూన్ శిథిలాలను అమెరికా సైన్యం వెలికితీసే పనిలో పడింది.ఇందుకోసం భారీ క్రేన్ తో సహా రెండు నౌకలను అమెరికా రంగంలోకి దించింది.